Wednesday 25 December 2013

భారతీయ విశ్వశాస్త్రం మీద పాశ్చాత్తుల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు

భారతీయ విశ్వశాస్త్రం , సృష్టి జ్ఞానం మాహాద్బుత విషయాలుగా పాశ్చాత్యులు  పరిగణిస్తారు. ఆర్తర్ హోలంస్, ఆలన్ వాట్స్, రాజర్ బెర్ట్ స్చౌసన్, డిక్ టెరిసీ, గయ్ సోర్మన్, కౌంట్ మౌరైస్ మేటర్లింక్, కార్ల్ సేగన్ వంటి మేధావులు, శాస్త్రవేత్తలు భారతీయ విశ్వశాస్త్రంపై అభిరుచి పెంచుకుని, అధ్యయనం చేసి, విషయాలను అవలోకనం చేసుకుని, తమదృక్పథాలను , అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించినారు.
ఆర్తర్ హోలంస్ (1895 - 1965), డర్హాం విశ్వవిద్యాలయం ఆచార్యుడు, భూగోళజ్ఞుడు, తాను రచించిన "ది ఏజ్ అండ్ ఆర్ట్" (1913 లో) పుస్తకంలో  "పశ్చిమంలో వైజ్ఞానిక పరంగా చూడక పూర్వమే, హిందూ మేధావులు, ఆశ్చర్య పరిచే విషయాలు విశదీకరించి చెప్పుటయేకాక,అందులో భూమి వయస్సు, అనంత కాల పరిమాణములు , బ్రహ్మాండముమరియు  సృష్టి స్థితి, లయ గురించి కూలంకషంగా వివరించినారు " అని విడమరిచి చెప్పినారు. 

ఆలన్ వాట్స్, సాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏషియన్ స్టడీస్, అధ్యక్షుడు మరియు  ఆచార్యుడు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ ఫెలోగా మన వేదాంతాన్ని పశ్చిమానికి, చాటుతున్న మేటి. ఆయన  "సాపేక్షత" ("రెలేటివిటీ") భారతీయ తత్వ-వేత్తలకి కొత్తేమీ కాదు. "సాపేక్ష సిద్ధాంతం" (రెలేటివిటీ) వారికి తెలిసికూడా  దానిని  ఆత్మసాధనకు  ఉపయోగించినారు కాని ఆటం బాంబులు తయారు చేయడానికి కాదు " అని నొక్కి చెప్పినారు. 
రాజర్ బెర్ట్ స్చౌసెన్ భారతీయ విశ్వశాస్త్రం మీద తన దృక్పదాన్ని ప్రకటిస్తూ "హిందువులు ఈ జగత్తు యొక్క అపారమైన కాలమానాలు విశధీకరించినారు. సేంట్ ఆగస్టైన్ ప్రకారం ప్రపంచం 5000బీ.సీ లో మొదలయ్యింది.ఈ వివరించిన కాలం భారతీయ కాలమానాలతో పోలిస్తే చలా తక్కువ. ఒక్క బ్రహ్మ రోజు 4,320,000,000 యేళ్ళు; బ్రహ్మ ఆయుర్ధాయం 311,040,000,000,000 యేళ్ళు అంటే 311 ట్రిలియన్ యేళ్ళు " అని తెలపడం అసాధారణం.
ప్రముఖ రచయిత డిక్ టెరిసీ వైజ్ఞానిక, పరిజ్ఞానిక రంగాలలోఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసినారు. అందులో "ది గాడ్ ప్రాక్టికల్", "ఇండియన్ కాస్మాలజిస్ట్స్" కూడా ఉన్నాయి. భారతీయ విశ్వశాస్త్రవేత్తల ఆవిష్కరణలను ఉదాహరిస్తూ, భూమి వయస్సు 4 బిలియన్ యేళ్ళ గా ఇచ్చిన వివరణ  నేటి అణు శాస్త్రానికి అనుగుణంగా ఉందని తెలిపినారు . భారతీయ అణు, పరమాణువుల పద్ధతులు, మన నుండి  పర్షియాకు ,పర్షియా నుండి నుండి పాశ్చాత్య దేశాలకి చేరింది ", అని విశ్లేషించారు.
అమెరికాలోని స్టాంఫోర్డ్, హూవర్ ఇన్స్టిట్యూషన్ విచ్చేసే ఫ్రాన్స్ దేశ లిబరలిజం నాయకుడు, మేధావి, గై సోర్మన్ " భారతీయ విశ్వశాస్త్ర ప్రతిభ అసాధారణం " అన్న ఖితాబునిచ్చినారు.
1911 లో సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన బెలిజియుం కవి కౌంట్ మౌరైస్ మేటర్లింక్ (1862 - 1949) తన పుస్తకం "మౌంటెన్ పాత్స్" లో భారతీయ విశ్వశాత్రంలోని జగత్సృష్టి విషయాలు అత్యంత ప్రాచీన మైనవనీ, అత్యద్బుత సృష్టని వర్ణిస్తూ, "ఇది ఏ యూరోపియన్ ఊహకు కూడా అందని అపవౄశీయత్వమని తన అభిమతాన్ని చాటేరు. ఈ పుస్తకములో కర్మను గూర్చి వారు వ్రాసిన విశ్లేషణ చదువ వలసిందే. 
ఈ విధంగా,  సృష్టి ,కాలము, విశ్వము  మొదలగు ఎన్నో విషయాలను  జగతికి చాటిన  మహాద్బుత మేధావులు. ప్రముఖ విశ్వశాస్త్రవేత్త, అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్ర ఆచార్యుడు కార్ల్ ఎడ్వర్డ్ సేగన్, భారతీయ విశ్వశాస్త్రాన్ని కొనియాడుతూ " వారి గణితం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఆ కాలంలోనే వారు భూమి వయస్సు, ఈ జగత్తు కాలమానం, దాని అనంత కాల పరిమాణాన్ని విశిదీకరించి చెప్పారు. నేడు ఉపగ్రహాలు పంపి, పరిశోధను చేసి ఈ కాలమానాలనే ద్రువీకరించారు. ఇట్టి అసాధారణ ప్రజ్ఞ, జ్ఞానం అలనాటి భారతీయ శాస్త్రవేత్తలలోసర్వసధారణం".

ఒక స్నేహితుడు ,నీ కుర్చీ టేబులు రేడియో టివి ఇలా ఎన్నో పాశ్చాత్యులు కనిపెట్టినారుకడా వారిని దూషించడ మెందుకు అని అడిగినాడు. బల్లలు కుర్చీలు మన వడ్రంగులు పీటలని బల్లలనీ ఆసనములనీ ఇంకా ఎంతో అందమైన విగ్రహాలని చెక్కి మన తరములకందించిన మహానుభావులు. జగదీశ్ చంద్రబోసు వేదశాస్త్రాల సహాయముతో రేడియో కనిపెడితే ఆ గౌరవము మార్కొనీకి దక్కించినారు పాశ్చాత్యులు. ఒక క్రొత్త వస్తువు కనుగొంటే దానిమీద పరిశోధనచేసి ఇంకా ఇంకా క్రొత్త వస్తువులు తయారు చేస్తూనే వున్నారు కదా. తపన ఉత్సుకత ఉన్న మానవుడు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో వుండనేవుంటాడు. విదేశీయులు మనపై దండయాత్ర చేయునంత వరకు మనది సంపూర్ణ నాగరికత. ఇప్పటికి మనపైన విజాతీయులు చూపే మాత్సర్యమును  గమనించుతూనేవున్నాముకదా!

No comments:

Post a Comment