Saturday 12 October 2013

ఘటికా స్థానము

ఘటికాస్థానాలు అన్న పేరు ఒక కాలములో విద్యానిలయాలకు ఉండేవని కొందరికి తెలిసి యుండ వచ్చు. ఈ పదమును విపులీకరించి విషయ వివరణ చేసినవారు జగద్గురువు చంద్ర శేఖర యతీంద్రులు. ఈ విషయాన్ని గురించి నేను వ్రాయడం లోని ముఖ్య వుద్దేశ్యము పాశ్చాత్యుల ఎలుబడికి పూర్వము శిక్షణ వ్యవస్థ ఎట్లుండినది అన్న విషయం తెలియబరచుటకే.
అసలు ఘటిక అంటే చిన్న కుండ అని అర్థము.
పెద్దది                     చిన్నది
లత                        లతిక
దీపము                  దీపిక
ఘటము                 ఘటిక

మరి ఈ పదమునకు విద్యా స్థానముతో లంకె ఎట్లు కుదిరినది. ఘటిక లేక ఘడియ అంటే ఒక అర్థము 24 నిమిసముల కాలము కూడా ఔతుంది. మరి దేనిని అన్యైన్చుకోవలేనన్నది సమస్య. చంద్ర శేఖర సంయమీంద్రులు
ఈ విధంగా తెలియజేసినారు.
వ్యాసులవారు బ్రహ్మ సూత్రములను వ్రాసినారు.దానికి శంకరులవారు భాష్యము వ్రాసినారు. ఆ భాష్యానికి వార్తీకము(భాష్యమునకు భాష్యము )'భామతి' యన్న పేరుతొ వాచస్పతి మిశ్ర యన్న వారు వ్రాసినారు. దానిని మారులా 'కల్పతరు' అన్న పేరు తో అమలానండులవారు వ్యాఖానించితే దానిని ఇంకా చక్కగా విమర్శించిలక్ష్మీ నరసిమ్హులనువారు 'అభోగము' అన్న వ్యాఖ్యాన గ్రంథాన్ని వ్రాసినారు. గురువులు చంద్రశేఖర సమ్యమీంద్రులు 'అభోగము' చదివి ఆపై 'కల్పతరు' చదివినారు. అందులో వారికి 'ఘటికాస్తాన' ప్రయోగము కనపడింది.
ఆ గ్రంథములోని 'ఏతు శిఖా యజ్ఞోపవీత త్యాగరూప పారమహంస్య వృత్తీం న మన్యంతే తేన పశ్యన్తి ప్రత్యక్ష ఘటికా స్తానేషు పఠ్యమాన అధర్వణీమ్ శృతీమ్ -స శిఖః వపనం కృత్వా బహిః సూత్రం త్యజెద్భువః' అని వున్న ఆ వాక్యములో ఘటిక శబ్దము వినవచ్చింది. ఆ వాక్యము అర్థమేమిటంటే పరమహంస వృత్తిని అవలంబించేవారు శిరోముండనము , యజ్ఞోపవీత త్యాగము,చేయనక్కరలేదను మాటను తెలిపే అధర్వణ శృతిని ఘటికా స్థానములలో చెప్పు చుండుట వినలేదా అని అన్నారు.మనకు ఘటిక తో సంబంధము కావున ముందునకు నడచెదము. క్రీస్తు శకము 13 శతాబ్దములో(రామానుజుల వారికి 100-150 ఏండ్ల పిదప)వున్నా యదావ మహాదేవులకు అమలానండులవారు సమకాలీకులు. అంటే 13 వ శతాబ్దము లోనే ఘటికా స్తానములుండేవని
మనకు పై విషయము వల్ల తేటతెల్లమగుచున్నది.
క్రీ.శ.4వ శతాబ్దము లోనే కర్నాటక దేశపు రాజు మయూరవర్మ పల్లవేంద్ర పురమైన కంచిలోని ఘటికా స్థానములలో వీరశర్మ యను గురువుల వద్ద విద్యనభ్యశించినారని షిమోగా జిల్లా తలగుండ యనుచోట ప్రణవెస్వరస్వామి ఆలయములో కకుత్స వర్మ యను రాజు కాలమునకు చెందినా శిలా శాసనములో వున్నది. అంటే గురువు గారు తీగ కదిలించి ఎంత దూరము వెళ్ళినారో గమనించండి. మహనీయులు తలపెట్టిన కార్యమును అర్ధాన్తరముగా విడువరు. అందుకే భర్తృహరి సుభాషితముల తెలుగు సేత లో'ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ... ప్రారబ్ధార్థము నుజ్జగించరు' అని చెబుతూ, ఎందుకంటే 'ప్రాజ్ఞ్యా నిధుల్ గావునన్' అని చెప్పినారు.
కావున విశేషమైన విద్య సంపాదించాలంటే 1000,1500 మైళ్ళ దూరము గూడా భారమయ్యేది కాదు. ఈ విధమైన ఘటికలను రాజులు జయించినట్లు,కట్టించినట్లు కూడా ఇంకా ఎన్నో శాసనములు కలవు. ఏతా వాతా చెప్పదలచుకోన్నదేమిటంటే ఆ కాలము లోనే విద్యకంత గుర్తింపు వుండినది.
ఇపుడు క్రీస్తు శకము నుండి క్రీస్తు పూర్వమునకు పోయిన,శంకరులవారి కన్నా చాలా పెద్దవారు, శంకరుల చే శృంగేరి మఠ ప్రధమ పీఠాధిపతిగా శంకరుల వారిచేతనే నియమింపబడ్డ  మండన మిశ్రులవారి  (సన్యాస నామము సురేశ్వరాచార్యులు) ప్రధమ గురువులు కుమారిలభట్టు మాన్యవరులు 'తంత్రీ వార్తీకం' అన్న పుస్తకం వ్రాస్తే దాని వ్యాఖ్యాత యైన భట్ట సోమేస్వరులవారు ఘటికా స్థానాన్ని ఈ విధంగా నిర్వచించినారు .
"వేద కౌశల గిజ్ఞాసార్థం తత్తత్ వేద విభాగ చిహ్న లేఖ్యాని ఘటికాయాం కుంభకాయాం నిక్షిప్య తత్తత్ వేద విభాగ పరీక్ష కాలే తాన్యాకృష్య ఆకృష్య లేఖా చిహ్నితం వెదపాఠమ్ ఇత్యధ్యేతారః అనుయుజ్యంతే ఇతి ఘటికా మార్గవర్తినో అనుయోగః."

అంటే ఘటికలో జరిగే విద్యా వ్యాసంగాన్ని 'ఘటికా మార్గ వృత్తి'అని తెల్పినారు. అచ్చట జరిగే పరీక్షను మీమాంసను 'అనుయోగం' అన్నారు. 

ఘటికలను (చిన్న కుండలను) ఉపయోగించి పరీక్షలను ఘటికలలో (విద్యా స్థానాలలో) జరిపేవారని సొమెశ్వరులు వివరించినారు. విద్యార్థుల వేద విద్యా కౌశలాన్ని పరీక్షించుటకు ఆయా వేద విభాగములను తెలిపే చీటీలు చుట్టగానో లేక మడిచియో వుంచి, పరీక్షార్థుల చేత  అందులోనుండి ఒకటి తీయించి అందలి విషయమును మౌఖికముగా తెలుపగోరేవారు. ఘటికా స్తానములకా పేరు ఈ విధముగా కల్గినది. 
ఒక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఘటికలను విద్యా స్తానములలోనే కాక వేద మంత్రములచే చైతన్యమైన గోపురములపై కళశములుగా నూ ఘటాభిషేకాల లోనూ పూర్ణకుభము తో దేవాలయ స్వాగాతములకును వాడేవారని మనకు తెలుస్తున్నది. ఘటికలకు ఇంట ప్రాధాన్యత వుంది మరి. 

ఈ ఘటికలు గోదావరి ప్రాంతములోని తుని తాలూకా చిక్కుళ్ళ అగ్రహారములో వున్నట్లు అక్కడ లభించిన ఒక తామర శాసనములో వున్నదని చంద్రశేఖర సరస్వతులవారు నుడివినారు. కర్ణాటకలోని తుమకూరు తోటప్ప ఆలయములోని 12 వ శతాబ్దపు శాసనములో కూడా ఘటికా స్తానమక్కడ వున్నట్లు వ్రాయబడినది. చెన్నరాయ పట్టాన,హాలెకెరె, మొదలగు చోట్ల గూడా ఇటువంటి శాసనములు గలవు. 
వీనియందు విద్యార్థులు 300 మొదలు 3000 వరకు ఉండేవారని తెలియ వచ్చుచున్నది. ఇచట అన్ని వర్ణములవారు విద్య నభ్యసించుచుండే వారు. కానీ ఘటికలో చేరుతయందు వయోవ్యత్యాసముండేది.  మొదటి మూడు వర్ణములకు ఉపనయనముండేది. అది కూడా ఒక్కొక్క వర్ణమునకు ఒక్కొక్క వయసులో. నాల్గవ వర్ణము వారికి వృత్తి కళలు,పురాణములు, నీతి బోధ,ధర్మశాస్త్రములు బోధించేవారు. నీతికి నిజాయతీకి పెద్ద పీట  వేసే వారు. ఒక కక్ష్య లోని చురుకైన విద్యార్థులు గురువుల చేత ఎన్నుకొనబడి మిగత విద్యార్థులకు విద్య బోధింప జేసేవారు. 
టి. బి. మేకాలేగారు ఫిబ్రవరి 2, 1935 న బ్రిటీషు పార్లమెంటులో మన దేశ విద్యా విధానాన్ని గూర్చి చెప్పిన మాట ఈ క్రింద యదా తధంగా పొందు పరచుట జరిగినది. 
"I have traveled across the length and breadth of India and I have not seen one person who is a beggar, who is a thief. Such wealth I have seen in this country, such high moral values, people of such calibre, that I do not think we would ever conquer this country, unless we break the very backbone of this nation, which is her spiritual and cultural heritage, and, therefore, I propose that we replace her old and ancient education system, her culture, for if the Indians think that all that is foreign and English is good and greater than their own, they will lose their self-esteem, their native self-culture and they will become what we want them, a truly dominated nation."
మనలో మన భాష(సంస్కృతం) మీద న్యూనతా భావమును ఏర్పరచి ఆంగ్లమును 'Indian Education Act' ద్వారా'రాజా రామ్మోహన్ రాయ్' వంటి దళారుల సహాయముతో, మన నెత్తిపై రుద్ది నేడు మనకీ దుర్దశ కలిగించినారు. 

ఇప్పటికింతే . 

తత్సత్ 


Dvs Prasad7:41pm Oct 12
Chaala kastpadi maaku vivarinchinanduku, kruthagnathalu. Idi chaduvu thunte, chinnappudu naa thatha gaaru (Deepala Pitchayya Sastry) gaaru cheppinatlundhi. Ee face book vaalu Telugu fonts Korda ichhinatlu ayithe baagundedi. Dhanyavaadavumulu.


Vvs Sarma commented on your status.
Vvs wrote: "మీరు ఘటికా స్థానములను గురించి తెలియచేసారు. చాలా బాగున్నది. Evolution of Educational Thought in India by Bhanvarlal Dwivedi, Northern Book Centre Delhi, 1994 లో కొంత సమాచారం ఉన్నది. అగ్రహారము, బ్రహ్మపురి, ఘటికాస్థానము, మఠము, దేవాలయము అనే ఐదు విద్యా కేంద్రాలుగా ఉండేవి అని వారు వ్రాశారు. మొదటిమూడూ ఉన్నత స్థాయివి. మఠములలో ముఖ్యముగా వారి వారి "మతములు - శైవము, వైష్ణవము, జైనము, బౌద్ధములను గురించిన శాస్త్రములు బోధించేవారు. దేవాలయాలలో పండిత పామరులకు అవసరమైన స్థాయిలో బోధన జరిగేది. మీరు వ్రాసిన రాజా రామ మోహన రాయి విషయం సత్యమే. నేను Renaissance - Europe, Bengal, Andhra - అన్న విషయము అప్పుడప్పుడు వ్రాస్తున్నాను. బెంగాల్ లో 1757 -1947 మధ్యకాలంలో విదేశీ నాగరికత, ఆంగ్లేయ విద్య, హిందూ సమాజ సంస్కరణలు వీటన్నిటి వెనుక, ఆంగ్లేయుల, క్రైస్తవ మిషనరీల ప్రభావం చాలా ఉన్నది. బ్రహ్మ సమాజం పూర్తిగా క్రైస్తవమత ప్రభావం ఉన్నదే. సగం మంది మహమ్మదీయులుగా మారిన బెంగాల్ లో ఈ అదునికత ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సంస్కృత విద్యలను నాశనం చేసింది. మన గురజాడ, వీరేశలింగం, రఘుపతి వెంకట రత్నం నాయుడు,కట్టమంచి రామలింగా రెడ్డి వీరందరిపైన బెంగాల్ ప్రభావము ఉంది. కమ్యూనిజం, క్రైస్తవ మతాల మధ్య కూడా ఒక విచిత్ర బాంధవ్యం ఉంది."












No comments:

Post a Comment