వేద ప్రసాదంposted toఅచ్చంగా తెలుగు
ఓం.
తరచూ మనం దీపావళి సమయంలో వింటూ ఉంటాం.
ఆర్యులు వేరే వారు అని.
ఇక్కడి వారైన ద్రవిడులపై అధికారం చెలాయిస్తున్నారని అని ఒక సిద్దాంతాన్ని పట్టుకుని ఉగిసలాడే వారి మాటలను.
మనకు కొన్ని అర్దాలు తెలియకపోతే ఇబ్బందిలో పడిపోయి మనం చెప్పలేకపోతే అది మన సంస్కృతికే ఇబ్బంది అవుతుంది.
కాబట్టి అందులో ఒకటయిన ద్రవిడము అను పదానికి అర్ధం ఇక్కడ ఇస్తున్నాం.
చూడగలరు.
_/\_.
ప్రదేశాన్ని బట్టి ఈ ప్రాంతానికి "ద్రవిడం" అని పేరు వచ్చింది.
స్వభావ దృష్ట్యా ఈ భారత ఖండంలో నివశించే వారు అందరు ఆర్యులయ్యే వీలుంది.
ప్రత్యేకించి వీరిని(అంటే మనల్ని)మాత్రం ద్రవిడులు అని ఎందుకు అనాలి అంటే మూడు వైపులా నీరు ఉంది కాబట్టి.
ద్రవిడులు ఆర్యులు వేరు వేరు అనీ కొందరు ఆర్యులు కొందరు ద్రవిడులు గా విభజించి గొడవలు పెట్టటం కుట్రలో భాగం అందులో ఇరుక్కుని వేరుగా మాట్లాడకుండా ఉండేందుకు ఈ పోస్ట్.
_/\_
నేను వేద ప్రసాదం వారు ప్రచ్రించిన అభిప్రాయముతో ఏకీభవిస్తున్నాను. 'ద్రవ ఇదం ' ఇది అంతా ద్రవము అంటే నీటి చేత చుట్టి యుండ బడినది అని నా అభిప్రాయము . 'కృణ్వంతే విశ్వం ఆర్యం ' అన్నది శాస్త్ర వచనము. ఆర్యం అన్న మాటకు అర్థము పవిత్రమైన అని చంద్రశేఖర సరస్వతులవారు చెప్పగా విన్నాను. అంటే మన పూర్వుల దృక్పథము ఎంత ఉత్కృష్ట మైనదో మనము అర్థము చేసుకో గలుగ వచ్చును.
ద్రావిడ శబ్దాన్ని విరివిగా ఉపయోగించే వారు తమిళులు. వాళ్ళకు ఈ దక్షిణాది భాషలన్నీ తమిళమునుండి వచ్చినాయని ఒక గ్రుడ్డి నమ్మకము. ఆ మాటకు వంట పాడుతూ కొంతమంది తెలుగు భాషా శాస్త్రజ్ఞులు కూడా ఆది ద్రావిడ జన్య భాషలనే ఒక నినాదమును లేవదీసి దానికి అనుకూలముగా ఎన్నో విషయాలను ప్రతిపాదించి అదే ఉండవచ్చును అన్న ఆలోచన మనలో కలిగించినారు. తెలుగులో మొట్టమొదటి doctorate తీసుకొన్న చిలుకూరు నారాయణ రావు గారు తెలుగు సంస్కృత జన్యమని సాధికారకముగా నిరూపించినారు. బహుశా అది చదివినవారట్లుంచి తెలిసిన వారు కూడా తక్కువ.
నేను భాషా శాస్త్రవేత్తను కాను. ప్రత్యేకముగా సంస్కృతము చదువుకోలేదు. కానీ నేను విన్న కన్నా కొన్ని విషయాలు మీ దృష్టి లోనికి తెస్తాను. చంద్రశేఖర యతీంద్రులు ధర్మ పరిరక్షకులే గాక మహా పండితులు. వారు చెప్పిన ఒక చిన్న ఉదాహరణను ఇక్కడ ఉటంకించుతాను. ఒక పండిత సమూహము వేద భాష్యము వ్రాయ సంకల్పించి ఒకచోట కూర్చిని వుంటే ఆంజనేయ స్వామి ఒక చీన్ మర్కట రూపములో చెట్టుపై కూర్చొని వేరొక మర్కటమును 'వారేమి చేస్తున్నారు' అని అడిగినారట. అందుకు ఆ మర్కటము వారు వేద భాష్యము వ్రాయబోవు చున్నారని తెలిపిందట. 'వారికి నవ వ్యాకరణములు' తెలుసునా అని అడిగినాడట. అది 'శకున శాస్త్రము' తెలిసిన ఆ పండిత సమూహము లోని ఒక పండితుడు విన్నాడు. ఆయన తన అనుయాయులతో చెప్పి ఆ పని నుండి విరమింపచేసినాడట. 'శకున శాస్త్రము' అంటే 'జంతు భాష.'
శకునము అంటే పక్షి అని అర్థము. విస్తృతముగా 'శకున శాస్త్రము' అన్న ఈ మాటను 'జంతు భాష' కు వాడినారు. సంస్కృతము లో తొమ్మిది వ్యాకరణములు ఉన్నవి. వేద సంస్కృత వ్యాకరణమునకు వాల్మీకి వ్యాస కాళీదాసాది మహాకవులు వాడిన సంస్కృత వ్యాకరణమునకు వ్యత్యాసమున్నదని పెద్దలు చెబితే విన్నాను.కాబట్టి ఇక్కడ మనకు అర్థమయ్యేదేమంటే సంస్కృతము లోనే తొమ్మిది వ్యాకరణాలున్నయని. అంటే మన భాషలన్నీ వీనిలోని ఏదో ఒక వ్యాకరణ జన్యమే.
ఇక తమిళము ను గూర్చి రెండు మాటలు చెప్పుకొందాము. ఇక తమిళము ను గూర్చి రెండు మాటలు చెప్పుకొందాము. (Southworth suggests that the name comes from tam-miḻ > tam-iḻ 'self-speak', or 'one's own speech'.)(The Tamil Lexicon of University of Madras defines the word 'Tamil' as 'sweetness'.[50] S.V Subramanian suggests the meaning 'sweet sound' from 'tam'- sweet and 'il'- 'sound'.[51]) ఒకరు (సౌత్ వర్త్) 'సెల్ఫ్ స్పీక్' అని ఒకరు 'స్వీట్ సౌండ్' అని విశధ పరచినారు. ఇది మూల తమిళము నకు ఆయా పండితులు తెలియబరచిన అర్థము. ఆ పదమునకు ఈ అర్థాలెట్లు అటుకుతాయో చదువరుల విచక్షణకు విడిచి పెడతాను. {It is also classified as being part of a Tamil language family, which alongside Tamil proper, also includes the languages of about 35 ethno-linguistic groups[35] such as the Irula and Yerukula languages (see SIL Ethnologue)}.
వీరు 'తోల్కాప్యం'తమ మొదటి గ్రంధముగా చెప్పుకొంటారు. తోల్ అంటే తొలి అని. కాప్యం అంటే కావ్యమని. మరి తోలి కావ్యమకుటమునకే అంటే తొలి పదము లోనే 'కావ్య'మన్న సంస్కృత శబ్దమును వాడితే మరి తొమ్మిది వ్యాకరణముల లోని వ్యాకరణమును ఆధారము చేసుకొనియుండదా. పై పెచ్చు దీనిని రచించిన వారు వింధ్యను దాటి వచ్చిన అగస్త్యులవారు అని వారే చెప్పుకొంటారు.ఆయన రామునికి శాస్త్రాస్త్రముల నిచ్చి రావణ వధకు తోడుపడినాడు కానీ రావణునికి సాయం చేయలేదు కదా. అంటే ఆయన ద్రవిడుడుకాడు అని చెప్పుటకు ఈ మాట చెప్పుచున్నాను. చంద్రశేఖర యతీంద్రులే తమిళ వ్యాకరణము ఆ తొమ్మిది లో మొదటిది అని తెలియబరచినారు.
మొన్న వచ్చిన అన్నియన్(అపరిచితుడు) యందిరన్(రోబో) సినిమాలకు వాడిన పేర్లు సంస్కృత నామములే యని వారి తెలిసి ఉండక పోవచ్చు. అన్నియన్"అన్య' శబ్ద జన్యము, యందిరన్ అంటే యాంత్రికుడు(రోబో) అని. వాళ్ళకు అక్షరాలు తక్కువ కావున వున్న అక్షరాలతో పర భాషా పదాలను విరిచి వారివిగా చేసుకొని విరివిగా తమవే అనుకోని వాడతారు.
ఏది ఎట్లైనా సంస్కృతము లేనిదే ఏ భాష లేదు. అది గ్రీకు లాటినే కానీ కాక. ఈ విషయం 'India In greece' (By Pococke) చదివితే అర్థమౌతుంది. పై పెచ్చు ఆర్యులు ఎరుపు ద్రవిడులు నలుపు అన్న భావమును కొందరు మహానుభావులు బహిర్గతము చేసినారు. బహుశా వారు రాముడు కృష్ణుడు నలుపేనని మరచి వుంటారు. వేద వ్యాసుని వర్ణించుతూ 'ప్రాంశు పయోదనీల తను భాసిత' అని ఆయన నల్లని వాడే అని చెప్పినారు. ద్రౌపది పేరు 'కృష్ణ'. అంటే ఆమె నలుపే. నారాయణుడు నలుపు. మరి ఆర్యులెవరు ద్రావిడులెవారు.
ఏతావాతా నేను చెప్పవచ్చిందేమిటంటే మనము భారతీయులము మనమంతా ఆర్యులము.
తత్సత్

No comments:
Post a Comment