స్పందన (Mothers' Day contd...)
మదర్స్ డే --ఫాదర్స్ డే కి వచ్చిన స్పందన నా మనసుకు సంతోషాన్ని కలిగించింది. కారణం నామాట వినెవాళ్ళున్నారని నేను గుర్తించడం. అందరికి పేరుపేరునా కృతజ్ఞుణ్ణి.
ఈ రచనకనుబంధంగా వచ్చిన ఒకటి రెండు సందేహాలను నాకు చేతనైనంత నివృత్తి చేసే ప్రయత్నము చేస్తాను. సందేహము వ్యక్తము చేసిన వారి పేర్లు వ్రాయుట అవసరము లేదనిపించింది.
1. విడాకులు :
Srinivas Ravinutala మీరు ఇంత బాగా వివరణ ఇచ్చినా మిమ్మల్ని తప్పుగా తలచేవారు ఎవరూ ఉండరని నా అభిప్రాయము. మీ వివరణ తప్పక
అందరూ చదివి,తల్లిదండ్రులను గౌరవిస్తారని ఆశిస్తున్నాను,మన దేశంలో ఇంక విడాకులు ఉండకూడదని కోరుకుంటున్నాను.
Vasudevarao Konduru నాగరికత పేరుతో, అయ్యా జనులారా దయచేసి సంస్కృతిని మరవకండి.

జనాభా పెరిగే కొద్దీ మనస్తత్వాలు కూడా ఒకరికొకరికి సంబంధము లేనంత ఎక్కువౌతాయి. 'పుర్రె కొక బుద్ది జిహ్వ కొక రుచి' అన్నారు పెద్దలు. 'లోకో భిన్న రుచి' అన్నది ఆర్య వాక్కు.రెండు వస్తువుల మధ్య గరుకుదనము ఎక్కువైతే రాపిడి కూడా అధికముగా వుంటుంది. ఈ సూత్రము జీవితానికి ఎంతో అన్వయించుతుంది. గరుకుదనానికి నునుపు దానము తోడైతే రాపిడి తగ్గుతుందిఅసలు ఇంకొక విషయం. చిన్నవయసులో అబ్బాయికి అమ్మాయికి పెళ్లి జరిగిందనుకొందాము. వారు ఆటపాటల్లో నొకరు అర్థము చేసుకొంటూ ఏంతో ఆనందంగా జీవితాన్ని గడిపి వేస్తారు. కాలము మారింది.పరిస్థితులు మారినాయి.పరదేశ వాసనలు పెరిగినాయి. సంపాదనలోనే సర్వస్వమున్నదన్న అపోహ ప్రబలిపోయింది. అన్నిటికీ మించి పెరిగే వయసుతో ఏర్పడిన స్థిరాభిప్రాయలతో 26-30 సంవత్సరాలమధ్య పెళ్ళిళ్ళు జరిగి తమ గ్రాహ్యత(perseption ) మార్చుకోలేక ఎన్నో పెళ్ళిళ్ళు పెడాకులౌతున్నాయి. సర్దుబాటుతనము తగ్గిపోయింది. భార్య భర్తను గానీ భర్త భార్యను గానీ తనవైపు మార్చుకోవాలన్న తపన తగ్గిపోయింది. సర్దుబాటు తనమే 'క్షమ'(tolerance )అంటే తాలిమి. అది ఇప్పుడు మనలోవుందా. పెద్దలు 'తాలిమి తనను గాయు ఎదుటి వారిని గాయు' అని చెప్పినారు. రామాయణము బాలకాండ 33వ సర్గలో కుశనాభుడు తన కుమార్తెలకు ఇట్లు చెబుతాడు 'అమ్మా మీరు క్షమ లో దేవతలనే మించినారు' అని చెబుతూ ఈ క్రింది శ్లోకాలను చెబుతాడు.
'అలంకారోహి నారీణాం క్షమాతు పురుషస్యవ దుష్కరం తచ్చయత్ క్షాంతం త్రిదసేషు విశేషతః ' యాదృశీ వః క్షమా పుత్రః సర్వాసా మవిసేషితః క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః''క్షమా యశః క్షమా ధర్మః క్షమయా నిష్ఠితాం జగత్' ఈ 2 1\2 శ్లోకాల సారాంశము ఓర్పు అనగా క్షమా అధికంగా కలిగి యుండటమే . విడి పోవుటకు మూల కారణము ఆవేశము. అదే అన్ని అనర్థాలకు మూలము. విడిపోయిన తరువాత అంతా బాగుంటుందని ఎవరైనా చెప్పగలుగుతారా. రెండు వైపులా పెద్దలు ఒక తటస్తమైన మంచి మనసు కలిగిన మధ్య్వర్తితో చర్చలకు కూర్చుంటే మంచి ఫలితము రాదా. ' శతకోటి దరిద్రాలకు అనంతకోటి వుపాయాలంటారు పెద్దలు.'
మనసుంటే మారగమదె కనిపిస్తుంది. నిలకడ లేని ఆకుకు కంప చేట్టే గతి. ఆకు ఆడ గానీ మగ గానీ.
ప్రజాస్వామిక ప్రభుత్వాలు వచ్చిన తరువాత, కంపూటర్లు వచ్చినతరువాత, విదేశీ సంస్కృతులు విరివిగా దిగుమతి చేసుకొన్న తరువాత విడాకులు విచ్చలవిడి అయినాయి గానీ, అంతకు ముందు ఈ సమస్యలు అరుదుగా తలెత్తినా ఇంటి గడప కె పరిమితంయ్యేవి. 'ఈమె సీత,నా సుత, నీకు దాసీ గా సమర్పిస్తున్నాను ఆమెను నీవు స్నేహితురాలిగా చూసుకొనేది' అని జనకమహారాజు రామునితో చెబుతాడు. నేటికి కూడా అది మన వివాహ విధిలో ఒక మంత్రమై కూర్చునింది. ఎంత గొప్ప మాటో చూడండి. నీకు దాసీ గా ఇస్తున్నా, నీవు స్నేహితురాలిగా చూసోకోనవలెను సుమా అంటున్నాడు. కావున పాశ్చాత్య నాగరికతా వ్యామోహము వీడి ఆర్ష ధర్మావలంబులై జీవితమును కొనసాగించిన కష్టములను ఎదుర్కొని పారద్రోలగల్గు శక్తిని కల్గి ఆలూ మగలు సుఖముగా జీవించ గలుగ వచ్చునని నాగట్టి నమ్మకము.
2. 'న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి'
ఈ వాక్యము యొక్క పూర్తీ పాఠము ఈ విధముగా వున్నది'పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే --పుత్రస్తు స్తావిరే భావే న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి'
ప్రకృతి సిద్ధమైన వాస్తవమేమిటంటే ఆడ మగల శారీరిక గుణ గణములు ఒకటి కాదు. ముదిమి మీద పడిన తరువాత ఒక జంటను గమనించితే భర్త భార్య కన్నా పెద్ద వాడైయుందడికూడా ఆమెను తాను చేయి పట్టుకొని, అవసరమైనప్పుడు, నడిపిస్తుంటాడు. కొడుకులు,ఆ కాలములో అధికముగా నీటి వర్తనులుండే వాళ్ళు(రావణుడు,దుర్యోధనుడు మొదలగు వారంతా) తల్లి విషయములో తప్పుడు పనులు చేయలేదు. ఆ తల్లులు తనయుల సంరక్షణలో సంతోషంగా వుండినారు. ఇపుడు అసలు విషయానికి వస్తాము. నేటి కాలములో కూడా interview, college seat securing,మొదలగు విషయాలకు తండ్రులు పిల్లల వెంట పోవుచున్నారు. భార్యా భర్త సినిమాకు పొతే సాధారణంగా భర్త భార్య వెనకాలవుంటాడు ఇక ముసలితనములో దుర్మార్గులు గా చరిత్ర కెక్కిన రావణాది దుష్టులు కూడా ముసలివారైన తమ తమ తల్లులను జాగ్రత్త గా సంరక్షించుకొన్నారు. పురాణెతిహాసములలో ఎక్కడా స్త్రీలు మేము అస్వతంత్రులము అని చెప్పలేదు. 'న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి ' ' అర్హసి' కాదు. అంటే వారికి భగవంతుడొసగిన శారీరికాకర్షణలు సమాజములో తెచ్చిపెట్టే ఇబ్బందుల నుండి తప్పించా వలెనంటే రక్షణ కావలెను కావున వారు విచ్చలవిడిగా సంచరించ కూడదన్న అర్థములో 'న స్వాతంత్ర్యం' అని వాడినారు గానీ అన్యధా కాదు.'పితా రక్షతి కౌమారే భర్తా రక్షతి యౌవ్వనే' మీకు అర్థమౌతుంది కావున నేను విశధ పరచ లేదు. 'పుత్రస్తు స్తావిరే భావే అంటే వయసుడిగి కదలలేని తనము వచ్చినప్పుడు,ఆమె భర్త అంతకన్నా ముసలివాడై ఉంటాడు కావున 'పుత్రః' కొడుకుల తోడవద్దా.
మరి తోడుంటే స్వాతంత్రము లేనట్లే కదా. ఇప్పుడు ఈ శ్లోకము స్త్రీలకూ తగునో తగదో మీరే నిర్ణయించుకోండి.
3. మదర్స్ డే-Anna Javies
1914 లో వుడ్రో విల్సన్ కు 'అన్నజావిస్' చెప్పే వరకూ అమ్మ గుర్తుకు రాలేదు. ఆయన సెకరెట్రీ లకు గుర్తు రాలేదు. అసలు అమ్మ సేవాభాము తో మరణించే ముందు వరకూ అన్నా జావిస్ కే అమ్మ గుర్తుకు రాలేదు. మన సాంప్రదాయమది కాదు. అమ్మ ఏ విధముగా మరణించినా ఆమె మరణ తిథి ని మరవకుండా గుర్తు పెట్టుకొని ప్రతియేటా ఆ తిథిన అమ్మకు తద్దినం పెట్టె సాంప్రదాయము మనది. బ్రతికినంతకాలము ఆమె ఆ కుటుంబమునకు చేసిన సేవ అమూల్యము.ప్రతి అమ్మ కు ఆవిధం గా తద్దినమో తర్పణమో వదులుతూవుంటే తల్లిని ఇంట జనాభా వుండే దేశము లో రోజూ తలచు కొన్నట్లు కాదా. అది daily, Mothers'Day అయిపోదా.
పాశ్చాత్యులు బ్రతికియున్న తమ స్వంత తల్లి\తండ్రి తో సంవత్సరానికి ఒక సారి భోజనము చేయుట వారి సాంప్రదాయము.క్రొవ్వొత్తులు కార్డు ముక్కలు వారి సంప్రదాయమే కానీ మనది కాదు. కావున ఆమె ప్రకటన (statement ) తమ వారికే గానీ మనకు కాదు.
నాకు ముఖ్యమని తోచిన ప్రశ్నలకు నా శక్తి మేరకు జవాబులు చెప్పినాను.
నన్ను తప్పుగా తలవరని తలుస్తాను.
తత్సత్

No comments:
Post a Comment