Monday, 4 November 2013

కార్తీక మాస ప్రారంభము నేడు. ఈ క్రింది పాటతో ఈ మాసపు ప్రచురణలు మొదలుపెడతాము అన్న ఉద్దేశ్యం తో నేను వ్రాసిన పాట ఈ దిగువన పొందు పరచుచున్నాను .

శంకర భక్త వశంకర పాలిత కింకర 
లోక శుభంకర హర హర ఓం నమః శివాయ 

ఫాలలోచనా పన్నగ భూషణ 
పర్వత జాత సువందిత చరణా 
ప్రమథ గణార్చిత అగణిత గుణగణ
పాహి పాహి మాంపాహి పరాత్పర 
ఓం నమః శివాయ ॥ హర హర॥ 

భస్మ లేపనా భాసుర వదనా
మదన దమన హైమాహృది సదనా
ఫణిగణ ఫణమణి రంజిత చరణా
పాహిపాహి మం పాహి పరాత్పర
ఓం నమః శివాయ ॥హర హర॥

No comments:

Post a Comment