Wednesday, 20 November 2013

బిరుదులు ********

బిరుదులు 

బ్రాందీ మత్తున వుంటే గాంధీ కనిపించునా 
నెహ్రూ వంశజులందున నేతాజీ ఉండునా 
వల్లభాయి పటేలునకు వారెక్కడ సరిదీటు 
ఉక్కుమనిషి కడ వుండదు ఉలూకమ్ములకు చోటు 
అన్నాడిఎంకే తో అక్రమ సంబంధం 
తెచ్చెను ఏమ్జీయారుకు తిరుగు లేని రత్నం **********
తెలుగుజాతి తెలుగునీతి తెలుగురీతి యని మనసా 
గర్జించే సింహమెదుట కానము,నక్కల తెలుసా 
పీవి యన పండినట్టి విజ్ఞ్యానిగ తెలుసుకొమ్ము
వీపీ లాయన నెవ్విధి వేలకట్టెద రనుకొందుము (వీ పీ= వెర్రి పుచ్చకాయలు)
అటలుడెంత జటిలుడో అందరికీ తెలిసినదే
రాహువుతో పోల్చకండి రారాజును పదేపదే
ధ్యానచంద్రునకు ధ్యానము ధ్యాసంతా హాకీనే
ఏమి ఇచ్చినాకూడా ఇంకయునూ బాకీనే
హిట్లరు ఆహ్వానమునే కాదని తాననగలుగు 

భరత రత్న బిరుదన్నది ఆమహానీయునికే తగు 
ఆటలోని నైపుణ్యము అందలమెక్కించ బోదు
అసలైనది లౌక్యమండి అది కల్గిన అసలు జోదు
బహు మార్గమ్ముల ధనము భరతరత్న బిరుదము

తమకు తామె చేరువౌను అదికలిగిన, ఇది నిజము
దేశము గర్వించదగ్గ నేతాయెను చూడు మోడి 
ప్రతిపక్షము దేనుగు పై దుమ్ముజల్లునట్టి  దాడి
భారత దేశాంబరమున ప్రభవించిన మణులు వాళ్ళు
వారిముందు దిగదుడుపీ వల్లకాటిలోని రాళ్ళు

No comments:

Post a Comment