వివాహ బంధం
భార్యాభర్తల సంబంధం ఎట్లుండవలెనని మన పెద్దలు నిర్దేశించినారో చూడండి :--
“వివాహ సమయంలో “సప్తపది” అనే తంతలో చదివే మంత్రాలలో
ఒక మంత్రం :
“ సఖా సప్త పదాభవ, సఖావౌ సప్త పదా బభూవః,
సఖ్యంతే గమేయం, సఖాత్తేమాయోషం ,
సఖ్యాన్యే మయోష్టా:”
అనగా ఈ ఏడడుగల బంధంతో భార్య, భర్తలమైన మనం ఇకపై
స్నేహితులుగా ఉంటూ, పరస్పరం స్నేహ భావాన్ని విడవకుండా
పయనిద్దాం. ఎంత ఉదాత్తమైనభావన! “ఆపత్స మిత్రం జానీమః ”
కష్టాలలో ఆదుకొను వాడే మిత్రుడు. అట్టి మిత్రభావంతో భార్యాభార్తలు
ఉంటే, వారి మధ్య కలతలు, కార్పణ్యాలు , ఆవేశకావేశాలు,
అసమానతలు లేకుండా నిత్య వసంతంలా వారి జీవితం
సాగిపోతంది. ఇంకా—
“ సంతుష్టో భార్యయా భర్తా భర్తా భార్య తధైవచ/
యస్మిన్నేవ కులేన్నిత్యం కల్యాణం తత్రవైధ్రువం ” అనగా
భార్య ,భర్తలు పరస్పరం ఒకర్ని ఒకరు గౌరవించుకొంటూ ప్రేమానురాగాలతో సంతుష్టంగా ఉంటారో |
ఆ ఇల్లు నిత్యకళ్యాణం పచ్చ తోరణంగా విలసిల్లుతుంది
No comments:
Post a Comment