Tuesday, 17 December 2013

కాళిదాస మహాకవి
దండి భవభూతి కాళీదాసులు భోజరాజు ఆస్తానములోని నవరత్నాలలోని మూడు అత్యున్నతమైన రత్నాలంటారు. ఒకసారి వారి మధ్య ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తింది . ఉండేది ఉజ్జయిని కాబట్టి వెంటనే ముగ్గురూ కాళికాలయానికి వెళ్లి అమ్మవారిని 'ఎవరు గొప్ప' అని అడిగినారట. అమ్మ ఈ విధంగా జవాబు చెప్పింది:
కవిర్దండి కవిర్దండి భవభూతిస్తు పండితః కోహంరండే 
త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః 
కవులలో ఉత్తముడు దండి పండితులలో భవభూతి అని చెప్పిందట అమ్మ. కాళీ వర ప్రసాదుడైన కాళిదాసుకు హడ్డులేని ఆగ్రహమొచ్చి మరినేనెవరు 'రండా' అన్నాడట. అమ్మ 'త్వమేవాహం' అని అన్నదట. అంటే 'నీవే నేను ' 'నీవే నేను' అని అన్నదట. అంతటి గొప్పవాడు ఆ మహనీయుడు. ఆయనను కొందరు మొన్నటి షేక్సుపియరుతో పోలుస్తారు. ఇది చాలా బాధాకరము.  కాళిదాసు వంటి మహాకవి అప్పటి కవులలోనే కాదు, ఆతరువాత కూడా  పుట్టలేదని చెపుతారు.దానికి ఒక చమత్కారమైన శ్లోకం ఉంది.
ఆ శ్లోకము ఇది--
‘పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠి కాధిష్ఠిత కాళిదాసః
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ.’
అర్ధము-
పురా=పూర్వము
కవీనాం-గణనా-ప్రసంగే= మహా కవులను లెక్కించుటకు (మొదట) 
కనిష్ఠిక+అధిష్ఠిత=చిటికెన వ్రేలు తెరచి
కాళిదాసః= కాళిదాసుని లెక్క పెట్టారుట
అద్యాపి=అప్పటినుండి,
తత్తుల్య=ఆయన తో సమానమైన
కవే:+అభావాత్=కవులెవరూ లేకపోవడం చేత
అనామికా= చిటికెన వ్రేలు పక్కన ఉన్న ఉంగరపు వ్రేలును  సంస్కృతం లో ‘అనామిక’ మంటారు. ‘అనామిక’ అనే పదానికి ‘పేరు లేనిది’ అనే మరొక అర్ధం కూడా ఉంది.
సార్ధవతీ-బభూవ = ఉంగరపు వేలుకి 'పేరులేనిది ’ అనే పేరు సార్ధకమై పోయిందట.  

No comments:

Post a Comment