Wednesday, 18 December 2013

దుష్ట చతుష్టయం 

భారతము లక్ష శ్లోకాలకు మించిన గ్రంథము. నావంటి అర్భకులకు అది గగన కుసుమమే. కానీ ఆ కుసుమములు కలిగిన వృక్షముల (పౌరాణికులు) క్రింద కూర్చుంటే కనీసము ఆ పూవుల వాసననైనా అఘ్రాణించవచ్చు అని నా ఉద్దేశ్యము. 

ఒక చాటువు, అందరికీ తెలిసినదే అయినా, ఒకసారి చాటుతాను. 

ప్రాతర్ ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః 
రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ  గచ్చతి  ధీమతామ్ 

బాహిరంగా ఈ శ్లోకానికి అర్థము చూస్తే ఉదయము జూదము మధ్యాహ్నము అడవారినిగూర్చి రాత్రులందు దొంగతనాలను గూర్చి మాట్లాడుకొంటూ బుద్ధిమంతులు కాలము గడుపుతారు అని. 
కానీ ఆంతరీకములో ఉదయము భారతము మధ్యాహ్నము రామాయణము రాత్రికి భాగవతమును గూర్చి చర్చించుటలో బుద్ధిమంతులు కాలము గడుపుతారు అని. ఈ అర్థము కూడా అందరికీ తెలిసిందే. ఇందులో నాకనిపించిందేమిటంటే పగలు దేవుని లీలలను గూర్చి చదివి రాత్రికి ఆయనను గూర్చిన విశ్లేషణలో కాలము గడిపితే ఎంతోకొంత కాలానికి ఆయనను చేరే దారి దొరుకుతుందేమో అని నా మనో భావన. 

ఏమైతేనేమి ఈ రోజు ప్రోద్దుననే భారతము లోని దుష్ట చతుష్టయమును గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందా మనిపించింది. 

భారతములోని దుష్టచతుష్టయం ఎవరన్నది అందరికీ తెలిసిందే. 'మాయాబజారు' సినిమా చూసిన పిల్లవాళ్ళకు కూడా తెలిసేవుంటుంది. నాకూతెలుసుననేదానికి గాను వారిపేర్లు తెలియజేస్తున్నాను 
1. దుర్యోధనుడు 2. దుశ్శాసనుడు 3. కర్ణుడు 4. శకుని. ఇక ఈ పెర్లలోని ప్రత్యేకత ఏమిటో కాస్త విశ్లేషించుకొందాము. 

1. దుర్యోధనుడు :దుః+యోధనుడు ఈ దుః అంటేనే చెడ్డ మార్గములో యోధనము అంటే పోరాటము అంటే 'A FoulGame Player' అని అర్థము. జీవితమంటే అంతులేని ఒక పోరాటమేకదా దానిని దుర్మార్గ గామియై సాధించాలనుకొంటాడు ఈ జీవుడు. ఈతనికి తోదబుట్టినవాడు దుశ్శాసనుడు . 

2. దుశ్శాసనుడు: దుః+శాసనుడు. దుః అంటే చెడ్డ అని ముందే చెప్పుకోన్నాము. శాసనము అంటే సాధికార నిర్ణయము అనేకదా. అంటే ఆ చెడు మార్గా పోరాటానికి ఈ చెడ్డ,అధికారముతోకూడిన, నిర్ణయాలు తోడైనాయి. చెడ్డ దారి లోపోవలెనని నిశ్చయించుకొన్న వాని మదికి చెడ్డ నిర్ణయాలే కదా వస్తాయి. పదే పదే అవే నిర్ణయాలెందుకు వస్తున్నాయి. విన్తున్నాడు కాబట్టి. ఆకర్ణిచుతున్నాదు కావున ఆతని మిత్రుడు 'కర్ణుడు' అయినాడు. 

3. కర్ణుడు : తన జీవితమునకు చెడ్డ దారినెంచుకొన్న వ్యక్తికి చెడ్డ తలపులే(దుశ్శాసనములే ) వినిపిస్తుంటాయి. కావున మంచి వినగలిగి కూడా, ఆ మంచిని పేద చెవిని బెట్టి, చెడ్డ కె చేయూత నివ్వడముతో మంచి చెడులకు సమానస్తాయి నివ్వలసిన ఆ చెవులు కలిగినవాడు "కు' కర్ణుడై నాడు. ఈ తీసుకొన్న చెడ్డ నిర్ణయములు చెప్పేది వాక్కు. మాటకు,శకునము అనే అర్థమున్నదని మాకాలేజీ లో మా గురువుగారు బ్ర.శ్రీ.వే. ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు చెప్పియుండినారు. 
4. శకుని: శకునమునకు ఒక అర్థము మాట ఐతే వేరొక అర్థమేమంటే పక్షి,పక్షి శాస్త్రము అని. అది పక్షి ఎడమనుండి కుడికి పొతే ఒక ఫలితము కుడినుండి ఎడమకు పొతే ఒకఫలితము, పక్షుల అరుపు లేక కూతల బట్టి కూడా ఫలితములున్నాయని ఈ శాస్త్రము చెబుతుంది. మన మిపుడు ఈ పదాన్ని ఒక కార్యము చేయుటకు మునుపు ఒక వ్యక్తి ఊహకు ఎదురయ్యే ప్రబల విబల చిహ్నములుగా ఉపయోగించుకొను చున్నాము. ఇక్కడ అంటా చెడుపే కావున శకునము దుశ్శకునమే. అంటే శకుని ధీ కూడా అదే దారి. 

ఈ నాల్గు దుర్లక్షణాలు అంటే 'దుష్ట చతుష్టయము' మానవునికి ఎంత దుర్హిత కారకములో గమనించండి. 

తత్సత్. 

No comments:

Post a Comment