Tuesday, 31 December 2013

నిర్వాణ షట్కము (ఆది శంకరాచార్య)

మనోబుధ్యహంకార చిత్తాని నాహం
న శ్రోత్రం న జిహ్వాన చ ఘ్రాణనేత్రం
నచార్వ్యోమ భోమిర్నతెజోనవాయుః
చిదానందరూపః శివోహం శివోహం

మనసు, బుద్ధి, నేను నాది అనే తపన అంటే అహంకారము, చిత్తము,ఇవి నేను కాను. కర్ణము,జిహ్వ,ఘ్రాణము ఇవియును నేను కాను.ప్ఱుథివ్యాపస్తేజోవాయురాకాశములు నేను కాను.అంటే పంచ భూతాత్మకమైన పంచకర్మేంద్రియములకు పంచజ్ఞానేంద్రియములకు విధేయుడను కాను. చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. సచ్చితానందానికి సులభమైన నిర్వచనము ' సత్ అంటే సత్యము – చిత్ అనిన జ్ఞానము -పర సుఖమే ఆనందము'.


నచ ప్రాణ సంగో నవి పంచ వాయుః 

నవా సప్తధాతుర్నవా పంచ కోశః

నవాక్పాణిపాదౌ నచోపస్థ పాయుః 

చిదానందరూపః శివోహం శివోహం 


పంచవాయువులు:ప్రాణ :    శ్వాస ద్వారా హృదయానికి తర్వాత అన్ని కణాలకు చేరే వాయువు
                        అపాన : ఊపిరితిత్తులు, విసర్జన అవయవాలద్వారా వ్యర్ధ పదార్దములు పంపే వాయువు
                        వ్యాన:  శరీరం యొక్క సంకోచ వ్యాకోచాలకు కారణం
                        ఉదాన: వాక్కు రూపంలో ఉండేవాయువు
                        సమాన:  జీర్ణమవటానికి ఉపయోగించే వాయువు
ఉప ప్రాణాలు 
                        నాగ : త్రేన్పు గా వచ్చే గాలి
                        కూర్మ : రెప్పవేయటానికి కారణమైన గాలి
                        కృకల :  తుమ్ము 
                        ధనంజయ :హృదయ నాడులను మూస్తూ తెరుస్తూ ఉండే వాయువు.
                        దేవదత్తం  : ఆవులింత లోని గాలి

ఈ ఐదు వాయువులు,ఐదు ఉపవాయువులు మన శరీరమును నిర్దేశించుతాయని శాస్త్ర వాక్యము.ప్రాణ వాయువు (శ్వాస) లేనప్పుడు చనిపోయినట్లు గుర్తిస్తారు.ధనంజయ వాయువు చనిపోయిన తర్వాత కూడా ఉండి శరీరం ఉబ్బటానికి కారణం అవుతుంది అని శాస్త్రము చెబుతుంది. 


సప్త ధాతువులు:  రక్తమాంసమేధోస్థిమజ్జారసశక్రములు  (చర్మము, రక్తము, మాంసము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం). ఇందులో చర్మము రక్తము మాంసము ఎముకలు క్రొవ్వు అందరికీ తెలిసినవే. మజ్జ అంటే ఎముక లోపలవుండే గుజ్జు, దీనినే bone marrow అని ఆంగ్లములో అంటారు. పూర్వము 'నీ తస్సదీయ' అనేమాట సాధారణంగానూ సినిమాలలోనూ (రేలంగి వాడినట్లు గుర్తు) వాడేవారు. 'తస్స' అంటే ఈ 'మజ్జ'యే.

పంచ కర్మేంద్రియములు : వాక్పాణిపాదోపస్థపాయువులు. అంటే మాట-వాక్కు, చేయి-చేత,పాదములు-కాళ్ళు,ఉపస్థ-జననేంద్రియము,పాయువు-గుదము, ఉపస్థాపాయువులు అంటే పురీష శౌచ ద్వారములు. 

నేను, పైన తెలిపినవేవీ కాను.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను. 

నపుణ్యం నపాపం ణ సౌఖ్యం ణ దుఖ్ఖం 
న మంత్రో నతీర్థం నవేదా నయజ్ఞ్యాః 
అహం భోజనం నైవ భోజ్యం నభోక్తా 
చిదానందరూప శ్శివోహం  శ్శివోహం 

నాకు పుణ్య పాపములులేవు. సుఖ దుఖ్ఖములు లేవు. మంత్ర తీర్థ దాన యజ్ఞాలులేవు. నేను భోజన క్రియనుగానీ ,భోజనమునుగానీ,బుజించేవాడినిగానీ కాదు.  చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

నమేద్వేష రాగౌ నమేలోభ మోహౌ 
మదోనైవ మేనైవ మాత్సర్యభావః 
నధర్మోనచార్థోనాకామోనమోక్షాః
చిదానంద రూపం శివోహం శివోహం 

నాకు రాగ ద్వేషములు లేవు.లోభామోహములు లేవు. మదమాత్సర్యములు లేవు.ధర్మార్థకామ మోక్షాలు లేవు.  చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

నమృత్యుర్నశంకానేమ్ జాతిభేదః 
పితానైవమేనైవ మాతానజన్మాః
నబంధుర్నమిత్రంగురుర్నైవశిష్యః 
చిదానంద రూపం శివోహం శివోహం 

మృత్యువు,భయము లేక సందిగ్ధత,జాతిరీతులు,తల్లిదండ్రులు,అసలు జన్మమే, బంధువులు మిత్రులు,గురువు,శిష్యులు ఏమీ లేవు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

మరి నేనెవరు ?

అహం నిర్వికల్పో నిరాకార రూపో 
విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణాం
నవాబంధానం నైవ ముక్తిర్నబంధః 
చిదానంద రూపం శివోహం శివోహం 

వికల్పము : మతి భ్రమ, ఉల్లంఘనం జ్ఞాపకశక్తి, ఆలోచన తగ్గిపోవు లక్షణము కలిగిన మానసిక స్థితి
        అస్తవ్యస్తం, తారుమారు. 

నేను వికల్పములకు అతీతుడను. ఎటువంటి వికల్పములూ నన్నంటవు.నేను సర్వవ్యాపిని. కావున నిరాకారుడను. నిరాకారుడనుకావున నేను నిరంజనుడను (దోషము లేని వాడిని).నాకు ఏవిధమైన ఇంద్రియ సంబంధము లేదు.నాకసలు బంధమూ లేదు మోక్షము లేదు.చితానందరూపుడైన శివుడను నేను.నేనే శివుడను.

ఆత్మ ను గూర్చి ఇంత వివవరంగా విశదంగా విపులంగా విలేవారీగా అబుద్ధికి గూడా బోధపడు విధముగా చెప్పిన ఆది శంకరులకు అంజలి ఘటించుట తప్ప అన్యము చేయ నశక్తుడను. 




Sunday, 29 December 2013

రచన: ఆది శంకరాచార్య
పరమేశ్వరునికి భక్తీ ప్రపత్తులతో కూడిన శోడశోపచారములతో కూడిన ఆత్మనివేదనము ఈ శ్లోకముల సారాంశము. 
రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ | 
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||
రత్నమయమైన పీఠము పై విరాజిల్ల జేసి,సాంబశివునికి, హిమజాలం అంటే గంగా జలముతో అభిషేకము చేసి దివ్యాంబరములు చుట్టి సువర్ణ మణిభూషలచే అలంకరించి మృగమదము అనగా కస్తూరి కలసిన చందనమునలది ,జాజి ,సంపెంగ ,బిల్వ అనగా మారేడు దళములతో  అలంకరించి ధూప దీపములను సమర్పించి , దయానిధివైన ఓ సకలచరాచరాధినాథా నేను హృదయ పూర్వకముగా అర్పించిన వీనిని స్వీకరించి నన్ననుగ్రహించు స్వామీ అని వేడుకొంటున్నాడు ఈ జీవాత్మ. 
సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||
రత్న ఖచితమైన బంగారు పాత్రలలో నెయ్యి, పాయసము, పంచభక్ష్యాలు, పాలు పెరుగు అరటిపళ్ళ పానకము  ఇంకనూ అనెకవిధములైన శాకపాకములతో శుభ్రమగు జలముతో  యథాశక్తి నైవేద్యము సమర్పించుచున్నాను ప్రభో దయతో స్వీకరించు. 
ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||
ఛత్రము చామరము(చమరీమృగ కెశములతో చేయబడిన వింజామర)నిర్మలమైన దృశ్యములు కర్ణపేయమైన  చిత్త శాంతిని కల్గించు సంగీతముతో నృత్యముతో, పరమాత్మా, నిన్ను రంజింపజేసి మిమ్ము స్తుతించి ,ప్రణుతించి ,సాష్టాంగ నమస్కృతులాచరించి నా మనసుకు తోచినట్లు,నా శక్తికి తగినట్లు నీను పూజించుకోనుచున్నాను పహప్రభో. 
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||
ఆత్మవు నీవు తల్లి పార్వతి మనస్సు సహచరులా ప్రాణములు ఇక శరీరమా అది గృహము పూజ అంటావా నీకే అర్పితమైన నేననుభవించే భోగములే   నిద్రావస్తాయే సమాధి స్థితి . సంచారము నీ ప్రదక్షిణము దుర్గాటములైన గిరులను గూర్చిన తలపులే నీకు నే సమర్పించే స్తోత్ర పాఠములు. నేను పైన తెలిపిన ఏ ఏ కర్మల నాచరించుచున్నానో అవి అన్నియు నీ ఆరాధనముగానే భావించుచున్నాను. 
కరచరణ కృతంవా కర్మ వాక్కాయజంవా 
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం 
విహితమహితంవా సర్వామే తక్షమస్వ 
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో 
పరమేశ్వరా నా చేతుల చేతలచే గానీ మనో వాక్కులచే గానీ శ్రావణము చేత గానీ దృష్టి చేతగానీ మనసు చేత గానీ (మనోవాక్కాయకర్మలచే)నీకు తెలిసియో తెలియకనో చేసిన నచ్చునట్టి, నచ్చనట్టి  పనుల నన్నిటిని కరుణా సముద్రుడవైన  మహాప్రభో క్షమించు. 
నాకు తెలిసినది చెప్పుటలో తప్పులు జరిగి వుంటే మిమ్ములను, ఆ పరమేశ్వరుని మన్ఃపోర్వకముగా క్షమాపణ వేడుకోను చున్నాను. 
నమస్తే నమస్తే నమస్తె నమః

శాస్త్రవైదుష్యం భుక్తికే కానీ ముక్తికి కాదు అని శంకరాచార్యులు వివేకచూడామణి లో ఇలా నొక్కి చెప్పారు. 
"వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్రవ్యాఖ్యాన కౌశలమ్। 
వైదుష్యం విదుషాం తద్వధ్భుక్తయే న తు ముక్తయే॥ 

Wednesday, 25 December 2013

భారతీయ విశ్వశాస్త్రం మీద పాశ్చాత్తుల వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు

భారతీయ విశ్వశాస్త్రం , సృష్టి జ్ఞానం మాహాద్బుత విషయాలుగా పాశ్చాత్యులు  పరిగణిస్తారు. ఆర్తర్ హోలంస్, ఆలన్ వాట్స్, రాజర్ బెర్ట్ స్చౌసన్, డిక్ టెరిసీ, గయ్ సోర్మన్, కౌంట్ మౌరైస్ మేటర్లింక్, కార్ల్ సేగన్ వంటి మేధావులు, శాస్త్రవేత్తలు భారతీయ విశ్వశాస్త్రంపై అభిరుచి పెంచుకుని, అధ్యయనం చేసి, విషయాలను అవలోకనం చేసుకుని, తమదృక్పథాలను , అభిప్రాయాలను ఈ విధంగా వెల్లడించినారు.
ఆర్తర్ హోలంస్ (1895 - 1965), డర్హాం విశ్వవిద్యాలయం ఆచార్యుడు, భూగోళజ్ఞుడు, తాను రచించిన "ది ఏజ్ అండ్ ఆర్ట్" (1913 లో) పుస్తకంలో  "పశ్చిమంలో వైజ్ఞానిక పరంగా చూడక పూర్వమే, హిందూ మేధావులు, ఆశ్చర్య పరిచే విషయాలు విశదీకరించి చెప్పుటయేకాక,అందులో భూమి వయస్సు, అనంత కాల పరిమాణములు , బ్రహ్మాండముమరియు  సృష్టి స్థితి, లయ గురించి కూలంకషంగా వివరించినారు " అని విడమరిచి చెప్పినారు. 

ఆలన్ వాట్స్, సాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఏషియన్ స్టడీస్, అధ్యక్షుడు మరియు  ఆచార్యుడు. హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రీసర్చ్ ఫెలోగా మన వేదాంతాన్ని పశ్చిమానికి, చాటుతున్న మేటి. ఆయన  "సాపేక్షత" ("రెలేటివిటీ") భారతీయ తత్వ-వేత్తలకి కొత్తేమీ కాదు. "సాపేక్ష సిద్ధాంతం" (రెలేటివిటీ) వారికి తెలిసికూడా  దానిని  ఆత్మసాధనకు  ఉపయోగించినారు కాని ఆటం బాంబులు తయారు చేయడానికి కాదు " అని నొక్కి చెప్పినారు. 
రాజర్ బెర్ట్ స్చౌసెన్ భారతీయ విశ్వశాస్త్రం మీద తన దృక్పదాన్ని ప్రకటిస్తూ "హిందువులు ఈ జగత్తు యొక్క అపారమైన కాలమానాలు విశధీకరించినారు. సేంట్ ఆగస్టైన్ ప్రకారం ప్రపంచం 5000బీ.సీ లో మొదలయ్యింది.ఈ వివరించిన కాలం భారతీయ కాలమానాలతో పోలిస్తే చలా తక్కువ. ఒక్క బ్రహ్మ రోజు 4,320,000,000 యేళ్ళు; బ్రహ్మ ఆయుర్ధాయం 311,040,000,000,000 యేళ్ళు అంటే 311 ట్రిలియన్ యేళ్ళు " అని తెలపడం అసాధారణం.
ప్రముఖ రచయిత డిక్ టెరిసీ వైజ్ఞానిక, పరిజ్ఞానిక రంగాలలోఎన్నో వ్యాసాలు, పుస్తకాలు వ్రాసినారు. అందులో "ది గాడ్ ప్రాక్టికల్", "ఇండియన్ కాస్మాలజిస్ట్స్" కూడా ఉన్నాయి. భారతీయ విశ్వశాస్త్రవేత్తల ఆవిష్కరణలను ఉదాహరిస్తూ, భూమి వయస్సు 4 బిలియన్ యేళ్ళ గా ఇచ్చిన వివరణ  నేటి అణు శాస్త్రానికి అనుగుణంగా ఉందని తెలిపినారు . భారతీయ అణు, పరమాణువుల పద్ధతులు, మన నుండి  పర్షియాకు ,పర్షియా నుండి నుండి పాశ్చాత్య దేశాలకి చేరింది ", అని విశ్లేషించారు.
అమెరికాలోని స్టాంఫోర్డ్, హూవర్ ఇన్స్టిట్యూషన్ విచ్చేసే ఫ్రాన్స్ దేశ లిబరలిజం నాయకుడు, మేధావి, గై సోర్మన్ " భారతీయ విశ్వశాస్త్ర ప్రతిభ అసాధారణం " అన్న ఖితాబునిచ్చినారు.
1911 లో సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన బెలిజియుం కవి కౌంట్ మౌరైస్ మేటర్లింక్ (1862 - 1949) తన పుస్తకం "మౌంటెన్ పాత్స్" లో భారతీయ విశ్వశాత్రంలోని జగత్సృష్టి విషయాలు అత్యంత ప్రాచీన మైనవనీ, అత్యద్బుత సృష్టని వర్ణిస్తూ, "ఇది ఏ యూరోపియన్ ఊహకు కూడా అందని అపవౄశీయత్వమని తన అభిమతాన్ని చాటేరు. ఈ పుస్తకములో కర్మను గూర్చి వారు వ్రాసిన విశ్లేషణ చదువ వలసిందే. 
ఈ విధంగా,  సృష్టి ,కాలము, విశ్వము  మొదలగు ఎన్నో విషయాలను  జగతికి చాటిన  మహాద్బుత మేధావులు. ప్రముఖ విశ్వశాస్త్రవేత్త, అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్ర ఆచార్యుడు కార్ల్ ఎడ్వర్డ్ సేగన్, భారతీయ విశ్వశాస్త్రాన్ని కొనియాడుతూ " వారి గణితం ఎంతో పురోభివృద్ధి చెందింది. ఆ కాలంలోనే వారు భూమి వయస్సు, ఈ జగత్తు కాలమానం, దాని అనంత కాల పరిమాణాన్ని విశిదీకరించి చెప్పారు. నేడు ఉపగ్రహాలు పంపి, పరిశోధను చేసి ఈ కాలమానాలనే ద్రువీకరించారు. ఇట్టి అసాధారణ ప్రజ్ఞ, జ్ఞానం అలనాటి భారతీయ శాస్త్రవేత్తలలోసర్వసధారణం".

ఒక స్నేహితుడు ,నీ కుర్చీ టేబులు రేడియో టివి ఇలా ఎన్నో పాశ్చాత్యులు కనిపెట్టినారుకడా వారిని దూషించడ మెందుకు అని అడిగినాడు. బల్లలు కుర్చీలు మన వడ్రంగులు పీటలని బల్లలనీ ఆసనములనీ ఇంకా ఎంతో అందమైన విగ్రహాలని చెక్కి మన తరములకందించిన మహానుభావులు. జగదీశ్ చంద్రబోసు వేదశాస్త్రాల సహాయముతో రేడియో కనిపెడితే ఆ గౌరవము మార్కొనీకి దక్కించినారు పాశ్చాత్యులు. ఒక క్రొత్త వస్తువు కనుగొంటే దానిమీద పరిశోధనచేసి ఇంకా ఇంకా క్రొత్త వస్తువులు తయారు చేస్తూనే వున్నారు కదా. తపన ఉత్సుకత ఉన్న మానవుడు ఎదో ఒక క్రొత్త అన్వేషణలో వుండనేవుంటాడు. విదేశీయులు మనపై దండయాత్ర చేయునంత వరకు మనది సంపూర్ణ నాగరికత. ఇప్పటికి మనపైన విజాతీయులు చూపే మాత్సర్యమును  గమనించుతూనేవున్నాముకదా!
Carl Sagan on Hindu cosmology

"The main reason that we oriented this episode of Cosmos towards India is because of that wonderful aspect of Hindu cosmology which first of all gives a time-scale for the Earth and the universe -- a time-scale which is consonant with that of modern scientific cosmology. We know that the Earth is about 4.6 billion years old, and the cosmos, or at least its present incarnation, is something like 10 or 20 billion years old. The Hindu tradition has a day and night of Brahma in this range, somewhere in the region of 8.4 billion years."
"As far as I know. It is the only ancient religious tradition on the Earth which talks about the right time-scale. We want to get across the concept of the right time-scale, and to show that it is not unnatural. In the West, people have the sense that what is natural is for the universe to be a few thousand years old, and that billions is indwelling, and no one can understand it. The Hindu concept is very clear. Here is a great world culture which has always talked about billions of years."
"Finally, the many billion year time-scale of Hindu cosmology is not the entire history of the universe, but just the day and night of Brahma, and there is the idea of an infinite cycle of births and deaths and an infinite number of universes, each with its own gods."
Carl Sagan was a distinguished Cornell University astronomer and Pulitzer Prize-winning author.
[edit] Roger Bertschausen "We in the West have long had trouble with time. Early
Arthur Holmes (1895-1965) geologist, professor at the University of Durham. He writes regarding the age of the earth in his great book, The Age of Earth (1913) as follows:Alan Watts, a professor, graduate school dean and research fellow of Harvard University, drew heavily on the insights of Vedanta. Watts became well known in the 1960s as a pioneer in bringing Eastern philosophy to the West. He wrote: "\ Judaism, Christianity and Islam had no inkling of the long age of the universe. Cosmologies from these religions were based on the notion that the universe started at a finite point in the recent past. St. Augustine set the beginning of the universe at 5000 BCE. For centuries, this figure was embraced by most Westerners. (And some continue to believe it.) Additionally, the early Christians also believed that the end of time as we know it was close at hand."Hindu tradition, for example, one day in the life of Brahma lasts 4,320,000,000 years. And Brahma lives for the equivalent of 311,040,000,000,000 human years. The historian of religions Huston Smith reports one way of conceiving of the Hindu time-frame.
Quoted views on Hindu cosmology

"Long before it became a scientific aspiration to estimate the age of the earth, many elaborate systems of the world chronology had been devised by the sages of antiquity. The most remarkable of these occult time-scales is that of the ancient Hindus, whose astonishing concept of the Earth's duration has been traced back to Manusmriti, a sacred book."
When the Hindu calculation of the present age of the earth and the expanding universe could make Professor Holmes so astonished, the precision with which the Hindu calculation regarding the age of the entire Universe was made would make any man spellbound."To the philosophers of India, however, Relativity is no new discovery, just as the concept of light years is no matter for astonishment to people used to thinking of time in millions of kalpas, (A kalpa is about 4,320,000,000 years). The fact that the wise men of India have not been concerned with technological applications of this knowledge arises from the circumstance that technology is but one of innumerable ways of applying it."

It is, indeed, a remarkable circumstance that when Western civilization discovers Relativity it applies it to the manufacture of atom-bombs, whereas Oriental civilization applies it to the development of new states of consciousness."I bring this up to show what far better scientists and philosophers than Bucaille have to say about science in non-monotheistic scriptures. Carl Sagan and others did not become idol-worshippers on that account. Then what value a discredited Bucaille?

శకుని --

వారము  రోజుల ప్రయత్నము ఈ శకుని వ్యాసము. తెలిసినంతవరకూ తెలియబరచినాను. యువకులు చదివి తెలుసుకొనగలిగితే నా ప్రయత్నమూ సఫలమైనట్లే. యువట్లక్కరలేదా అంటారేమో. వాళ్ళే కాబోయే తల్లులు. తప్పక చదివి తీరవలసినవారు . ఇక పెద్దలు తమ పిల్లలతో చదివింప జేసి మన ఇతిహాసమును భావితకందిస్తారని ఆశిస్తాను. 

శకుని 

గాంధార రాజ్యము మహాభారత కాలములో భారత దేశమునకు పశ్చిమమున వున్నా రాజ్యము. ఇందు పుష్కలావతి ,తక్షశిల,పురుషపురములు ఇందలి ముఖ్య పట్టణములు. శ్రీరామ చంద్రుని తమ్ముడు భరతుడు ఈ భూభాగామునేలినట్లు ఐతిహ్యము.మహాభారత కాలానికి సుబలుడు గాంధార రాజు. ఆయనకు అచల,వృక్షక, వృహద్వల, సౌబల అన్న కొడుకులుంటారు. సౌబలుడే శకుని అని పెద్దలనగా విన్నాను.గాంధారి పెద్దది. శకుని అందరికన్నా చిన్నవాడు. 

మహాభారత సమయములో, కురురాజుగా అభిషిక్తుడైన ధృతరాష్ట్రునికి భీష్ముడు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈడు వచ్చిన యువకునికి పెళ్లిచేయాలనుకోవడంలో విశేషమేముంది కానీ, ఆ సమయంలో భీష్ముని ఊహల్ని ప్రధానంగా మరొకటి ఆక్రమించుకుంది. అప్పటికి కొన్నేళ్ళ క్రితమే కురువంశం ఆగిపోయే ప్రమాదం భయపెట్టింది. వ్యాసుని జోక్యంతో ఆ గండం గడిచింది. ఆ అనుభవం ఇప్పటికీ భీష్ముని ఆలోచనల్లో పచ్చిగానే ఉంది.  కనుక ధృతరాష్ట్రుని పెళ్లిని మించి, ఆ పెళ్లితో కులం నిలిచే అవకాశమే అతనికి కొట్టొచ్చినట్టు కనిపించింది. విదురునితో ఆలోచనలను కలబోసుకున్నాడు. ఇక వధువు ఎవరన్న విషయానికి వస్తే, గాంధారరాజు సుబలుని కూతురు గాంధారి మంచి రూపమూ, లావణ్యమూ, శీలమూ, ఆభిజాత్యమూ కలిగిన కన్య అని బ్రాహ్మణుల ద్వారా విన్నాడు. పైగా వందమంది కొడుకులు కలిగేలా ఆమె వరం పొందిందని తెలిసి మరింత ముచ్చటపడ్డాడు. సుబలునితో మాట్లాడి రమ్మని కొంతమంది వృద్ధులను పంపించాడు.
ధృతరాష్ట్రుడు పుట్టంధుడు. అయినాసరే, సుబలుడు భీష్ముని కోరికను కాదనే అవకాశం లేదు. ఎందుకంటే, రాజు ధృతరాష్ట్రుడే కానీ, రాజ్యరక్షకుడు భీష్ముడే. అతడు పరాక్రమవంతుడే కాక, కాశీ రాజు కూతుళ్లను రాక్షసవివాహ పద్ధతిలో ఎత్తుకు వెళ్ళి, తన తమ్ముడు విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేసిన చరిత్ర అతనికి ఉంది. కనుక ఆ ప్రతిపాదనకు  ఒప్పుకుని మర్యాద నిలుపుకోవడమే మంచిదని సుబలుడు అనుకొని ఉండవచ్చు. దాంతో, ‘గాంధారిని ధృతరాష్ట్రునికి ఇచ్చితి’నని బంధువుల మధ్య ప్రకటించినాడు. గాంధారి ఆ మాట విని తండ్రి మాటపై గౌరవముతో ధృతరాష్ట్రుని తన భర్తగా భావించింది. ఈ కళ్ళతో ఇక పరపురుషుని చూడరాదనుకుని నేత్రపట్టం కట్టుకుంది. ఓ రోజున సోదరుడైన శకుని గాంధారినీ, గొప్ప సంపదనూ వెంటబెట్టుకుని హస్తినాపురానికి విచ్చేయుటతో గాంధారీ-ధృతరాష్ట్రుల వివాహం వైభవంగా జరిగిపోయింది.చక్రవర్తుల సంబంధమగుటచే శకుని హస్తినలోనే నిలిచి పోయెను. ఇంకొక విషయము ఇక్కడ వున్నది . శకుని గాన్దారికన్నా చాల చిన్నవాడు. తోడుగా ఉండుటకు కూడా వుండిపోయి ఉండవచ్చును. 
ఇక్కడ ఒకచిన్న ప్రస్తాపన. గాంధార రాజైన సుబలుడు ఆస్థాన జ్యోతిష్యులతో తన కుమార్తెకు పెళ్ళయిన తక్షణమే వైద్యము వచ్చునని ఎరిగినవాడై ముందామెను ఒక మేకపోతుకు కట్టి దాని చంపినపిమ్మట  ధృతరాష్ట్రునికిచ్చి పెళ్ళిచేసెనని ప్రతీతి. కౌరవ పాండవులు బాల్యమందు మాత్సర్యముచే కౌరవులు 'రండా పుత్రు' లని తిడితే పాండవులు వారిని 'ముండాపుత్రు'లన్నారనీ ఆ కోపముతో వయసు వచ్చిన తరువాత దుర్యోధనుడు గాన్దారము పై యుద్ధము ప్రకటించి సుబలుని అతని కుమారులందరినీ చెరసాలలోబంధిస్తే,వారికి వేసే తిండి మెతుకులు అన్నీ కలిపి శకునికి పెట్టి వారు మరణిచినారనీ సుబలుడు చనిపోతూ తన వెన్నెముక లోని ఎముకలతో పాచికలు తయారుచేసుకొని శకునిని వుంచుకొమ్మన్నాడని, దుర్యోధనుని వినాశము కోరినవాడై ఆ పాచికలతో ధర్మరాజును ఓడించి ఆ తరువాత వచ్చే యుద్ధములో దుర్యోధనుని పాండవులు మట్టుపెడతారని ఊహించియే అట్లు చేసినాడని ఒక ప్రచారముంది. దీని మూలములు భారతము నందు కనిపించవు. పైగా సుబలుడు తన పరివారముతో రాజసూయమునకు వచ్చినాడని, యాగము ముగిసిన తరువాత గౌరవంగా అతనిని ధర్మజుడు సాగానంపినాడని భారతమున కలదు. భారత యుద్ధములో సుబలుని వారసులు కౌరవుల పక్షమున పోరాడినారని కూడా యున్నది. 
శకుని జన్మనామము సౌబలుడని విన్నాను.ఇది కూడా సుబలుని కుమారుడైనందువల్ల నేమో.  శకుని గాంధారికన్నా బాగా చిన్నవాడు అని ముందుగానే చెప్పుకోన్నాము.దుర్యోధనునికన్నా బహు కొద్ది సంవత్సరములు పెద్దవాడు అయివుండవచ్చు. అందువల్లనే అతని సహవాసము దుర్యోధనునితో ఎక్కువ బావయైన ధృతరాష్ట్రునితో తక్కువ.బావను చేరి తన మాట వినిపించిన ఉదంతమేదియు భారతమున కానరాదు. సార్వభౌమత్వము పై కామము,తనను అది చేరనందువల్ల క్రోధము అదే సర్వస్వమన్న మోహము తో నున్న దుర్యోధనునకు, మదించిన దుశ్శాసనుడు,తాను పొందిన రాజ్యము దానినిచ్చిన సార్వభౌమునికి తానే సన్నిహితునిగా ఉండాలన్న లోభము కలిగిన కర్ణుడు,తనకు దక్కినస్థానము వేరెవరికీ దక్క కూడదనుకొన్న శకుని దుర్యోధనుని ఆవహించియుండగా అతనికి బంధ విముక్తి బొందె వదిలితేనే కదా. కావున అన్ని విధములైన కుతంత్రములలో మొదలు శకుని పిదప కర్ణుడు ఆపై తందానా తానాకు దుశ్శాసనుడు, చచ్చేవరకు అంటిపెట్టుకొనే ఉండిపొయినారు.

మయ సభలో జరిగిన అవమానమునకు ప్రతీకారముగా జూదమాడి తాను రాజ్యాన్ని సంపాదించి పెడుతానని శకుని దుర్యోధనునితో అంటాడు. సభా పర్వములోని 20,21,22 శ్లోకాలు ఏమితెలుపునంటే 'దుర్యోధనా! జూడమాడుటలో నాకు ఎవరూ సాటి రారు. మీ తండ్రిని ఒప్పించి ధర్మరాజుతో జూదమునకు ఏర్పాటు చేయి.ధర్మజుని రాజ్యలక్ష్మిని సంపూర్తి గా నీకు స్వాధీనమొనర్తు'నని శకుని ఒప్పించినాడు. ఇక్కడే మనకర్థమౌతుంది. శకునికి ధృతరాష్ట్రునివద్ద కానీ, మిగిలిన కురు వృద్ధ ,గురు వృధ్ధ బాంధవుల వద్ద కానీ ఎటువంటి పరపతీ లేదని. దుర్యోధనుడు అందరినీ ఒప్పించుటలో కృతకృత్యుడైనాడు. ఇక శకుని జూదములొ గెలుచుటయే ఆలస్యము. 
ఆచార విధానాలు రెండు విధములు. ఒకటి శిష్ఠాచారము రెండవది వామాచారము. ధర్మరాజుది శిష్టాచారమైతే శకునిది  వామాచారము. పాచికల విషయములో 'అక్షహృదయ'మను విద్య శిష్టాచారమునకు సంబంధించినదైతే 'పాశాధిష్ఠాత్రీ' అనునది వామాచారమునకు సంబంధించిన విద్య. జూదమాడే సమయమునకు ధర్మ రాజుకు 'అక్షహృదయము' తెలియదు కానీ శకునికి 'పాశాధిష్ఠాత్రి' సమగ్రంగా తెలుసు. అందుకే అతను, దుర్యోధనుని చేత, మొదటి సారి మాత్రమే పందెము పెట్టించినాడు. తరువాత వరుస విజయములచేత పందెము పెట్టించే అవసరమే కలుగలేదు శకునికి. ( ఈ విషయమును బ్ర.శ్రీ.వే. మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి ద్వారా తెలుసుకొన్నది. ) ఇంతటి ఘాతుకమును తలపెట్టిన శకుని ప్రాణములను యుద్ధములో తీసెదనని ప్రతిన పూనుతాడు సహదేవుడు. 
ధర్మజుడు ఈ అక్షహృదయమనే విద్యను  అరణ్య వాసములో వున్నప్పుడు బృహదశ్వుడు అను మహర్షి అనుగ్రహముతో  నేర్చుకొంటాడు కానీ ఆ తరువాత ఈ ఆట ఆడే అవసరము ధర్మరాజుకు ఏర్పడలేదు.

రాయభారము విఫలమగుటతో ఇరువైపులా యుద్ధమునకు సిద్ధమౌతారు. భీష్ముడు శరతల్పగతుడౌతాడు. ద్రోణుడు విగతుడౌతాడు కర్ణుడు సైన్యాధ్యక్షుడౌతాడు. 17వ రోజున యుద్ధము భీకరంగా జరుగుతూ వుంటుంది. ఆ మహాసంగ్రామములో సహదేవుడు శకునికి ఎదురౌతాడు .

శకుని కుతంత్రుడే కానీ కువీరుడు కాదు. అతడు  సహదేవుడితో తలపడి పది బాణములు అతడి శరీరంలో గ్రుచ్చుతాడు. ఆ దెబ్బకు సహదేవుడు  మూర్ఛిల్లగా  అది చూసి భీముడు  శకుని ముందున్న గాంధార సైన్యమును నాశనం చేయసాగుతాడు. అది చూసి కౌరవసేనలు పారి పోగా సుయోధనుడు ధైర్యం చెప్పి వారిని ముందుకు పురికొల్పుతాడు .సహదేవుడు  మూర్ఛ నుండి తేరుకుని శకుని మీద పది బాణములు ప్రయోగించి అతడి విల్లు ఖండించుతాడు. శకుని  వేరొక విల్లు తీసుకొని సహదేవుడి మీద శరవర్షం కురిపించఉతాడు. శకుని  కుమారుడైన ఉలూకుడు సహదేవ, భీమసేనుల మీద బాణవర్షం కురిపించగా  సహదేవుడు  కోపించి ఒకే ఒక బల్లెము విసిరి ఉలూకుడి తల ఖండించుతాడు. తన కుమారుడు తన కళ్ళ ముందే చనిపోవడం చూసి చలించిన శకుని ఆగ్రహోదగ్రుడై సహదేవుడి మీద మూడు బాణములు వేయగా సహదేవుడు  ఆ మూడు బాణములను ఖండించి శకుని  విల్లు విరిచి వేస్తాడు. శకుని  మహా కోపంతో సహదేవునిపై కత్తిని, గధను, బల్లెమును ప్రయోగించాడు.సహదేవుడు  వాటిని మధ్యలోనే ఖండించగా  అది చూసి శకుని  తన రధ రక్షకులతో సహా అక్కడి నుండి పారి పోతాడు. సహదేవుడు  అతడిని నిలువరించి " ఓ గాంధార రాజా ! రాజ ధర్మం విడిచి ఇలా పారి పోవడం నీవంటి సుక్షత్రియునకు తగదు. నాడు జూదం ఆడిననాడు చూపిన చాతుర్యం ఇప్పుడు చూపు. నీవు ఆడించిన మాయా జూదంకు ఫలితం చూసావు కదా సర్వనాశనం అయింది. నాడు జూదంలో ఓడి పోయి తలలు వంచుకున్న మా కోపాగ్ని జ్వాలలల ఫలితం చూచితివి కదా! మమ్ము అవమానించినందుకు సుయోధనుడు తన వారందరిని పోగొట్టుకుని అనుభవిస్తున్నాడు. ఆ సుయోధనుడు చూస్తుండగా నీ తల తెగి నేలను ముద్దాడేలా కొడతాను " అని అంటూ సహదేవుడు శకుని రధాశ్వములను, కేతనమును, విల్లును ఖండించగా అది చూసి శకుని  అత్యంత భయంకరమైన శక్తి ఆయుధమును సహదేవుడి మీద విసిరుతాడు. సహదేవుడు  ఆ శక్తి ఆయుధమును ఖండించి రెండు చేతులలో రెండు బల్లెములను తీసుకొని అత్యంత వేగంగా శకుని  మీద వేసి అతడి తల ఖండించి వేస్తాడు. శకుని తల నేల పడగానే శరీరం కూడా నేల మీదకు వాలిపోతుంది. మహాభారత యుద్ధానికి కారణ భూతుడైన గాంధార రాజు శకుని  సహదేవుడి చేతిలో మరణించాడు.ఆ విధంగా సహదేవుడు తన ప్రతిజ్ఞ నేరవేర్చుకొంటాడు. 

Wednesday, 18 December 2013

దుష్ట చతుష్టయం 

భారతము లక్ష శ్లోకాలకు మించిన గ్రంథము. నావంటి అర్భకులకు అది గగన కుసుమమే. కానీ ఆ కుసుమములు కలిగిన వృక్షముల (పౌరాణికులు) క్రింద కూర్చుంటే కనీసము ఆ పూవుల వాసననైనా అఘ్రాణించవచ్చు అని నా ఉద్దేశ్యము. 

ఒక చాటువు, అందరికీ తెలిసినదే అయినా, ఒకసారి చాటుతాను. 

ప్రాతర్ ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః 
రాత్రౌ చోర ప్రసంగేన కాలౌ  గచ్చతి  ధీమతామ్ 

బాహిరంగా ఈ శ్లోకానికి అర్థము చూస్తే ఉదయము జూదము మధ్యాహ్నము అడవారినిగూర్చి రాత్రులందు దొంగతనాలను గూర్చి మాట్లాడుకొంటూ బుద్ధిమంతులు కాలము గడుపుతారు అని. 
కానీ ఆంతరీకములో ఉదయము భారతము మధ్యాహ్నము రామాయణము రాత్రికి భాగవతమును గూర్చి చర్చించుటలో బుద్ధిమంతులు కాలము గడుపుతారు అని. ఈ అర్థము కూడా అందరికీ తెలిసిందే. ఇందులో నాకనిపించిందేమిటంటే పగలు దేవుని లీలలను గూర్చి చదివి రాత్రికి ఆయనను గూర్చిన విశ్లేషణలో కాలము గడిపితే ఎంతోకొంత కాలానికి ఆయనను చేరే దారి దొరుకుతుందేమో అని నా మనో భావన. 

ఏమైతేనేమి ఈ రోజు ప్రోద్దుననే భారతము లోని దుష్ట చతుష్టయమును గూర్చి నాలుగు మాటలు మాట్లాడుకొందా మనిపించింది. 

భారతములోని దుష్టచతుష్టయం ఎవరన్నది అందరికీ తెలిసిందే. 'మాయాబజారు' సినిమా చూసిన పిల్లవాళ్ళకు కూడా తెలిసేవుంటుంది. నాకూతెలుసుననేదానికి గాను వారిపేర్లు తెలియజేస్తున్నాను 
1. దుర్యోధనుడు 2. దుశ్శాసనుడు 3. కర్ణుడు 4. శకుని. ఇక ఈ పెర్లలోని ప్రత్యేకత ఏమిటో కాస్త విశ్లేషించుకొందాము. 

1. దుర్యోధనుడు :దుః+యోధనుడు ఈ దుః అంటేనే చెడ్డ మార్గములో యోధనము అంటే పోరాటము అంటే 'A FoulGame Player' అని అర్థము. జీవితమంటే అంతులేని ఒక పోరాటమేకదా దానిని దుర్మార్గ గామియై సాధించాలనుకొంటాడు ఈ జీవుడు. ఈతనికి తోదబుట్టినవాడు దుశ్శాసనుడు . 

2. దుశ్శాసనుడు: దుః+శాసనుడు. దుః అంటే చెడ్డ అని ముందే చెప్పుకోన్నాము. శాసనము అంటే సాధికార నిర్ణయము అనేకదా. అంటే ఆ చెడు మార్గా పోరాటానికి ఈ చెడ్డ,అధికారముతోకూడిన, నిర్ణయాలు తోడైనాయి. చెడ్డ దారి లోపోవలెనని నిశ్చయించుకొన్న వాని మదికి చెడ్డ నిర్ణయాలే కదా వస్తాయి. పదే పదే అవే నిర్ణయాలెందుకు వస్తున్నాయి. విన్తున్నాడు కాబట్టి. ఆకర్ణిచుతున్నాదు కావున ఆతని మిత్రుడు 'కర్ణుడు' అయినాడు. 

3. కర్ణుడు : తన జీవితమునకు చెడ్డ దారినెంచుకొన్న వ్యక్తికి చెడ్డ తలపులే(దుశ్శాసనములే ) వినిపిస్తుంటాయి. కావున మంచి వినగలిగి కూడా, ఆ మంచిని పేద చెవిని బెట్టి, చెడ్డ కె చేయూత నివ్వడముతో మంచి చెడులకు సమానస్తాయి నివ్వలసిన ఆ చెవులు కలిగినవాడు "కు' కర్ణుడై నాడు. ఈ తీసుకొన్న చెడ్డ నిర్ణయములు చెప్పేది వాక్కు. మాటకు,శకునము అనే అర్థమున్నదని మాకాలేజీ లో మా గురువుగారు బ్ర.శ్రీ.వే. ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు చెప్పియుండినారు. 
4. శకుని: శకునమునకు ఒక అర్థము మాట ఐతే వేరొక అర్థమేమంటే పక్షి,పక్షి శాస్త్రము అని. అది పక్షి ఎడమనుండి కుడికి పొతే ఒక ఫలితము కుడినుండి ఎడమకు పొతే ఒకఫలితము, పక్షుల అరుపు లేక కూతల బట్టి కూడా ఫలితములున్నాయని ఈ శాస్త్రము చెబుతుంది. మన మిపుడు ఈ పదాన్ని ఒక కార్యము చేయుటకు మునుపు ఒక వ్యక్తి ఊహకు ఎదురయ్యే ప్రబల విబల చిహ్నములుగా ఉపయోగించుకొను చున్నాము. ఇక్కడ అంటా చెడుపే కావున శకునము దుశ్శకునమే. అంటే శకుని ధీ కూడా అదే దారి. 

ఈ నాల్గు దుర్లక్షణాలు అంటే 'దుష్ట చతుష్టయము' మానవునికి ఎంత దుర్హిత కారకములో గమనించండి. 

తత్సత్. 

Tuesday, 17 December 2013

కాళిదాస మహాకవి
దండి భవభూతి కాళీదాసులు భోజరాజు ఆస్తానములోని నవరత్నాలలోని మూడు అత్యున్నతమైన రత్నాలంటారు. ఒకసారి వారి మధ్య ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తింది . ఉండేది ఉజ్జయిని కాబట్టి వెంటనే ముగ్గురూ కాళికాలయానికి వెళ్లి అమ్మవారిని 'ఎవరు గొప్ప' అని అడిగినారట. అమ్మ ఈ విధంగా జవాబు చెప్పింది:
కవిర్దండి కవిర్దండి భవభూతిస్తు పండితః కోహంరండే 
త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం నసంశయః 
కవులలో ఉత్తముడు దండి పండితులలో భవభూతి అని చెప్పిందట అమ్మ. కాళీ వర ప్రసాదుడైన కాళిదాసుకు హడ్డులేని ఆగ్రహమొచ్చి మరినేనెవరు 'రండా' అన్నాడట. అమ్మ 'త్వమేవాహం' అని అన్నదట. అంటే 'నీవే నేను ' 'నీవే నేను' అని అన్నదట. అంతటి గొప్పవాడు ఆ మహనీయుడు. ఆయనను కొందరు మొన్నటి షేక్సుపియరుతో పోలుస్తారు. ఇది చాలా బాధాకరము.  కాళిదాసు వంటి మహాకవి అప్పటి కవులలోనే కాదు, ఆతరువాత కూడా  పుట్టలేదని చెపుతారు.దానికి ఒక చమత్కారమైన శ్లోకం ఉంది.
ఆ శ్లోకము ఇది--
‘పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠి కాధిష్ఠిత కాళిదాసః
అద్యాపి తత్తుల్య కవేరభావాత్ అనామికా సార్ధవతీ బభూవ.’
అర్ధము-
పురా=పూర్వము
కవీనాం-గణనా-ప్రసంగే= మహా కవులను లెక్కించుటకు (మొదట) 
కనిష్ఠిక+అధిష్ఠిత=చిటికెన వ్రేలు తెరచి
కాళిదాసః= కాళిదాసుని లెక్క పెట్టారుట
అద్యాపి=అప్పటినుండి,
తత్తుల్య=ఆయన తో సమానమైన
కవే:+అభావాత్=కవులెవరూ లేకపోవడం చేత
అనామికా= చిటికెన వ్రేలు పక్కన ఉన్న ఉంగరపు వ్రేలును  సంస్కృతం లో ‘అనామిక’ మంటారు. ‘అనామిక’ అనే పదానికి ‘పేరు లేనిది’ అనే మరొక అర్ధం కూడా ఉంది.
సార్ధవతీ-బభూవ = ఉంగరపు వేలుకి 'పేరులేనిది ’ అనే పేరు సార్ధకమై పోయిందట.  

Wednesday, 11 December 2013

భగవద్గీతా ప్రవేశము

ఎందఱో మహనీయులు, మహానుభావులు,మహాగురువులు భాష్యము వ్రాసిన భగవద్గీత తిరిగీ నేను విమర్శనాత్మకంగా తెలియబరచే అవసరము గానీ,శక్తి గానీ భగవంతుడు నాకు ఇవ్వలేదు. అయినా ఒక్క విషయము మాత్రము శ్రద్ధాళువులతో పంచుకోవాలనిపించి ఈ చిన్న ప్రయత్నము.

భారత యుద్ధ వార్తలను ధృతరాష్ట్రునకు చెప్పుటకై వేదవ్యాసులవారు సంజయునికి కురుక్షేత్ర సంగ్రామము వీక్షించగల దివ్య దృష్టి నొసంగి నియమించిరి.

ఈ గీతా ప్రవేశద్వారము వద్ద మొదట నిలిచినది ధృతరాష్ట్రుడు .
ధృతముఅంటే ధరింపబడిన అని అర్థము, రాష్ట్రుడు అంటే రాష్ట్రమును కలిగినవాడు అని అర్థము. అంటే చక్రవర్తి యని అర్థము. ఈ పేరుకు ఇంకొక అర్థమూ వుంది. ధృతమన్న మాటకు ఆనందము అని ఒక అర్థము. రాష్ట్రము అన్న మాటకు ఉత్పాతము అని ఒక అర్థము (బ్రౌణ్య నిఘంటువు). అంటే ఉత్పాతములయందు ఆనందమును పోడువాడు అని. చూచినారా పూర్వము పేరు పెట్టుటలోని సార్థకత. ఆలోచిస్తే భారత యుద్ధమునకు ఈ పేరే దారి తీయించిందేమో అనిపిస్తుంది.

ఇక రెండవ వాడు సంజయుడు. సత్+జయుడు సంజయుడౌతుందని అందరికీ తెలిసిన విషయమే. 'ఏకం సత్' అన్నది వేదం వాక్కు.అంటే ఆ సత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ ను జయించినవాడే సంజయుడు. 'ఏకం సత్' అన్నది వేదవాక్కు. అంటే' ఆసత్తే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను జయించినవాడే సంజయుడు. అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అంశయే కదా. సంజయుడు ఆయన అనుగ్రహము పొందుట అంటే ఆయనను జయించినట్లే కదా.

భారతము ఇతిహాసమని సోదాహరణముగా పండితులచేత నిరూపింప బడినది. ఇది ఇపుడు నిర్వివాదము. అప్పుడు ఇందులోని పాత్రల పేర్లు కథ కొరకు పెట్టినవి కావని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. వారి పేర్లు వారి స్వభావమునకు ఎంత అతికినట్లు సరిపోతూ వుందో పైన దొరికిన రెండు మెతుకులు పట్టి చూస్తే తెలుస్తుంది.

కృష్ణుడు అర్జనునకు చేయు గీతోపదేశ మటుంచి ఆ ఉపదేశానికి ఉపోద్ఘాతమునకు , ఒక ఉత్పాతములయందు ఉత్సాహము కల్గినవాడు, ఎట్లు నాంది పలుకుచున్నాడో గమనించండి. భగవద్గీత ధృతరాష్ట్రుడు సంజయున్ని ప్రశ్నించిన ఈ శ్లోకముతో మొదలౌతుంది.

శ్లో.ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
    మమకాః పాణ్డవాశ్చైవ కిమ కురవత సంజయ

ఈ శ్లోకాన్ని బాహ్యంగా గమనిస్తే

సంజయా! యుద్ధము చేయ నిచ్చగించినవారై  ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున కూడిన నావారును పాండవులును ఏమి చేసిరి?

ఇందులో ఒక అంతరార్థము వున్నది. అదేమిటంటే యుద్ధము చేయ నిచ్చాగించినవారు, యుద్ధము చేయుట సహజమే అయినా, చేయనిర్నైన్చుకొన్న ప్రదేశము ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము. వామన పురాణములో ఈ విధంగా చెప్పబడింది.కురు మహారాజు తన సామ్రాజ్యమునకు సరియగు రాజధానిని సమకూర్చుకొన సంకల్పించి ఎన్నో ప్రాంతములను వేదికి ఈ ప్రాంతమునకు వచ్చి ఈ ప్రాంతపు ప్రత్యేకతలను ఈ క్రింది విధముగా తెలుసు కొన్నాడు.

ఈ ప్రాంతము,బ్రహ్మ ఎన్నో వేల సంవత్సరములు తపమాచ్రించుతవలన బ్రహ్మ వేడిగానూ,సరస్వతీ నది ఉత్తరవాహినియై ప్రవహిన్చుతవలన ఉత్తరవేదిగానూ, సరస్వతీ యమునా నదుల సంగమము దృష్టావతి గా ఇక్కడ పిలువబడేది. ఈ ప్రాంతము సప్త గుణ సంపన్నమైనదని ఇచ్చట నగరము నేర్పరచ తన అనుచర గణమునకు నిర్దేశించినాడు.ఈ సప్త గునములేమిటివన:1.తపస్సు  2.సత్యము 3.క్షమ 4.దయ 5.శుచి 6.దానము 7. బ్రహ్మచర్యము. ఈ ప్రాంతమును రాజధానిగా ఎన్నుకొన్న తన పరమ భక్తుడైన కురు మహారాజుకు శ్రీ మహావిష్ణువు రెండు వరాలను ప్రసాదించినాడు . 1.ఆ ప్రదేశమికపై కురుక్షేత్రముగా పిలువబడుతుందని 
2.అక్కడ మరణించిన వారు స్వర్గవాసులౌతారని.

ఋషులు అనేకక్రతువులను నిర్వహించుట వలనను,వేదవ్యాసులవారు వేదములను ఋగ్ యజుస్ సామ అధర్వణములుగా విభజించుట వల్లను ఈ ప్రదేశమునకు ధర్మక్షేత్రమనే పేరు కూడా స్థిరపడినది. అందువల్లనే ధృతరాష్ట్రుడు 'ధర్మక్షేత్రే' 'కురుక్షేత్రే' వాడినాడని చెప్పవచ్చును.

ఇందులో ఒక గూఢార్థము కూడా ద్యోతకమగుచున్నది. 'క్షి' యనగా నాశము (చెడు కర్మలు చేయుటవల్ల )
'త్ర' అనగా రక్షణ (పుణ్య కార్యములు చేయుటవల్ల) 'కురు' చేయుటవల్ల కలిగించేది.ఆ క్షేత్రము వేరే కాదు ఈ శరీరమే. అందువల్ల ఈ శరీరమే కురుక్షేత్రమయ్యింది.
మమకారము తనవారిపైన చంపుకోలేని ధృతరాష్ట్రుడు అందుకే 'మామకాః' అని వాడియుంటాడు. ఇక 'పాండవాః'
అని కూడా ఆయన వాడుతాడు. 'పాండువు' అంటే తెలుపు స్వచ్చత అని అర్థం. పాండురాజు రక్త హీనత వల్ల పాలిపోయిన శరీరుడై (బొల్లి - తెల్లదనము వల్ల) పాండురాజైనాడు. ఇక పాండు కు 'స్వచ్చత' అన్న అర్థము ఉండుటవల్ల సత్వ గుణ సంపన్నులైన పాండవులు ధర్మ పరులైనందువల్ల ఆమాట ఆయనచే వాడబదినదేమో.
కావునకురుక్షేత్ర సంగ్రామ ఉపోద్ఘాతములోనే చెడ్డ పై మంచి గెలుస్తుందని చెడ్డని పుట్టించిన వ్యక్తి(తండ్రి) యే
చెప్పినాడంటే భారత కాలములో  వైయక్తిక జీవన విదానమేట్లున్నది మనము అర్థము చేసుకోన వచ్చును.
ఈ శరీరిభూమిపై ఉన్నంత కాలము ఈ మంచిచెడుల అంతర్మథానము కొనసాగుతూనే వుంటుంది.

కావున ఈ వివరణను సంగ్రహించితే, ఈ 'శ్లోకము', కురుక్షేత్రమగు ఈ శరీరముతో సత్కర్మల నాచరించి దానిని ధర్మ క్షేత్రమొనరించి రజస్తమోగుణములపై సత్వము జయము సాధించవలయునని తెల్పుచున్నదని నా భావము .

స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీశాం 
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా స్సుఖినోభవంతు 

తత్సత్ 






















Tuesday, 10 December 2013

నా మదిలో నిలచిన 'శల్యుడు'

ఏమిటి ఈయన నా మదిలో శల్యుడంటున్నాడు, శల్యునివలె ఇతనుకూడా దుర్మార్గుడేనా అనుకొంటారెమో, నా విషయమట్లుంచితే శల్యుడు దుర్మార్గుడు కాదు. ఇది నా మనసున నాటుకొన్న మాట . పరిస్థితుల ప్రభావము అతనిని చెడ్డ వారి చెంత చేర్చినా మాట నిలుపుకొన్న మానధనుడు. నా చేతనైనంత వరకు నా మాట నీటి మూట కాదని తెలియజేసే ప్రయత్నము చేస్తాను. చేయలేకపోతే నా తప్పు మన్నించి నన్ను వదిలివేయగలరు. 

మాన్యులైన యువ పాఠకులకు మరొక ముఖ్యమైన విజ్ఞప్తి. భారతము చరిత్ర. ఇది పుక్కిటి పురాణము కాదు. నేను పండితుడనూకాను పౌరాణికుడనూకాను. యువత మన పూర్వుల ఘనత తెలిపే ఈ రసభరిత చరిత మనః పూర్వకముగా చదివితే విజ్ఞుల వద్ద వినునపుడు ఇంకా బా గుగా అర్థము చేసుకోగలరు. నా ఈ చిన్ని యత్నము వమ్ము చేయరని ఆశిస్తాను. చదవకుండానే లైకులు కొట్టవద్దు. 

భారతమునకు 'జయ'మను నామము కూడా కలదు . శాస్త్ర వచనమేమిటంటే 'యతోధర్మస్తతోజయః'. గీతా వచనమేమిటంటే 
'అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్.' అన్నీ కలిపి చూస్తే భగవంతుడు ధర్మము  వైపు నిలిచి అధర్మముతో యుద్ధము చేసి ధర్మ ప్రతిష్ఠాపన గావించినాడు. యుద్ధము అంటే చతుర్విధోపాయాలున్నాయి. సామ దానాలు పనిచేయలేదు కావున భేద దండోపాయాలే అనుసరించ వలసి వచ్చింది భారత యుద్ధములో. ఈ భేదోపాయములోని భాగంగానే భీష్మ,ద్రోణ,కర్ణ శల్యాదులను చంపుట. ఒక్కొక్కరి విషయములో ఒక్కొక్క విధమును అనుసరించుట జరిగినది. 

కురుక్షేత్ర యుద్ధ ఆరంభములో ధర్మరాజు శిరస్త్రాణము కవచము పాదరక్షలు వదిలి కురుసైన్యములోనికి పోయి భీష్మునికంజలించి ఆయన ఆశీర్వాదము కోరుతాడు . అందుకు భీష్ముడు సంతసించి ఈ విధేయత నీవు ఏకారణము చేతనైనా చూపకుండి యుండినచో  నిన్ను శపించి యుండెడి  వాడనని చెబుతాడు. అట్లు చెబుతూ నీ వినయమునకు సంతసించితిని నీకు జయమగు గాక అని దీవించుతాడు. అదికాక కౌరవులచేత పోషింపబడు వాడనైనందున యుద్ధము చేయవలడను కోరిక తప్పించి వేరేదైనా కోరిక కోరమంటాడు. ఆత్మ లో తర్జన భర్జన చేసుకొని మిక్కిలి వినయముతో,hypocrisy కాదు,అంటే వంచన చేయు ఉద్దేశ్యముతో కాదు , అడిగితె ఇప్పుడవసరము లేదు తగిన సమయములో చేబుతానంటాడు. (భీష్మ 43 అ 37 నుండి 42,47)ఇదే విధంగా భీష్ముడు కర్ణునితో కూడా యుద్ధము జరుగబోయే ముందు నీవు పాండవ  పక్షము చేరితే ఈ యుద్ధమే ఆగిపోవగలదని చెబుతాడు. కానీ కర్ణుడు చెవియొగ్గడు. ఎవరి ధర్మము వారు వీడక యుద్ధమునకు ఆయత్తులౌతారు. ఇట్లు లోతుకు వెళ్ళేకొద్దీ ధర్మమే మనకు గోచరించుతుందికానీ అధర్మముకాదు. 

ఈ సందర్భములో మరొక్క విషయము మనవి చేసుకొంటాను. వ్యాస భారతములో శ్రీకృష్ణుడు ఉపప్లావ్యమునకు పోవునపుడు కర్ణుని తన రథములో ఎక్కించుకొని పాండవ పక్షమున చేరమని సలహా ఇస్తాడు కానీ ద్రౌపది నీకు గూడా భార్య ఔతుంది అనడు. ప్రాతః కాలము మొదలు ఆరవ కాలమైన నిశాముఖమందు (ప్రాతః, సంగవ,మధాహ్న, అపరాహ్ణ,సాయం, నిశాముఖమ్) పట్టాభిషేకము జరుగగా ద్రౌపది బంగారు వెండి మట్టి కడవలతో వివిధ సుగంధ వనస్పతులతో అభిషేకించును అని చెప్పినాడు. 
అంతేకానీ పాండవులతోబాటు నీకూ పట్టమహిషి అగునని చెప్పలేదు. తిక్కన గారి భారతములో ఈ విషయాన్ని తెలుపుతూ ఒక పద్యములో ఈ విధముగానున్నది:'పాంచాల రాజ పుత్రిక అంచితముగ నిన్నుబొందు నార్వుర వరుసన్' అని చెప్పగా తిరుపతి వేంకటకవులు తమ పాండవోద్యోగములో 'ఆ సతి పెళ్లియాడుగద ఆరవ భర్తగ సూర్యనందనా ' అని వ్రాసినారు . ఇక్కడ ఆర్వుర వరుసన్ అన్నది కాలమునకే గానీ ఆరవభర్త కాదని బ్ర.శ్రీ,వే. మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు తమ ధర్మప్రసంగములలో చెప్పియున్నారు. ఇదంతా ఎందుకు చెప్పవచ్చినానంటే ఒక లక్ష శ్లోకములు గల భారతమునక్షరమక్షరము గుర్తుంచుకొనుట ఏదో కొందరికి, మల్లాది వారు ,సామవేదం వారు,చాగంటి వంటి వారికే సాధ్యము.మనము గుర్తుంచుకొన వలసినది మనకు స్థూలముగా అధర్మమని గోచరించు విషయములెన్నో ధర్మవిదితములే యని . అసందర్భమనుకోకుంటే హిమాలయ ప్రాంతాలలో  దుర్యోధనునికి గూడా గుడి వున్నదని విన్నాను. ద్రౌపదిని కూడా కలుపుకొని ఒక్క పాండవుల విషయములో తప్ప అతనిని తప్పు పట్టు వీలు   మనకు భారతములో దొరుకదు. 

ఇక శల్యుని విషయమునకు వస్తాము.మద్రి దేశ యువరాజైన శల్యుడు, ఎన్నో దేశాల  జయించి వచ్చుచుండిన పాండురాజునుగాంచి ఆతనికి వివాహమున తన చెల్లెలినిచ్చి మైత్రి చేసుకొంటాడు. ఆయన సకల యుద్ధవిద్యలయందును పారంగతుడు. గదాయుద్ధమందును,ఖడ్గ చాలనమందును,అస్త్ర శాస్త్ర ప్రయోగమునందును,అన్నిటి కన్నను  మిన్నగా  ఆశ్వ శాస్త్ర పారంగతుడు. మాద్రి సహగమనముతో భర్తను అనుసరించిన తరువాత శల్యుడు, ఆమె పుత్రులైన, నకుల సహదేవులను తనవెంట తీసుకుపోయి మద్ర దేశాధీశులుగా చేయ సంకల్పించినా వారు కుంతీదేవి తోనే వుంటామంటారు . సహదేవునికి తన తమ్ముని కుమార్తె విజయను ఇచ్చి పెళ్లి చేస్తాడు. పాండవులు అజ్ఞాతవాసము నుండి వచ్చిన తరువాత ఉపప్లావ్యములో వారిని కలిసి రాబోవు యుద్ధమునకు మద్దత్తుగా తన వెంట ఒక అక్షొహిణి సైన్యమును తీసుకొని శల్యుడు మద్ర నుండి బయలుదేరుతాడు. ఇక్కడ శల్యుని వీరత్వమును గూర్చి చెప్పుకోవాలి . అతని బలహీనత మదిర, మగువ . అతనప్పటికే వయసులో పెద్దవాడు కానీ గొప్ప యోధుడు. అతను బహుళాస్త్ర శాస్త్ర పారంగతుడు గదాయుధ్ధమునందు  ఆరితేరినవాడు కృష్ణునితో ఢీకొనగల ఆశ్వ చాలకుడు.ఈ విషయాలు ముందే చెప్పుకొన్నాము కూడా.  ఇవియన్నియు తెలిసే దుర్యోధనుడు కుయుక్తిపన్ని అతని బలహీనతపై దెబ్బ కొడతాడు. బలహీనతా వివశుడైన శల్యుడు ఈ వసతులన్నీ కల్పించినది ధర్మరాజని భ్రమపడి ఈ వసతులు కల్పించిన వానికి తన మద్దత్తు ప్రకటించుతాడు. అప్పుడు సుయోధనుడగుపించి అసలు విషయం చెబుతాడు. శల్యుడు, తన వారికి అప్రియమైనా సరే, ఇచ్చిన మాట దాటక ఒక సారి ధర్మజుని కలిసి తనవద్దకు వస్తానని మాట ఇస్తాడు. 

శల్యుడు చెప్పినదంతా విని,ధర్మరాజు జరిగిన దానికి తన మనః పూర్వక సమ్మతినితెలిపి ఒక్క విషయము లో ఆయన సలహా కోరుతాడు . ఎటుదిరిగీ కౌరవులు శల్యుని కౌశలము తెలిసినవారైనందున కర్ణునికి సారధి కమ్మన వచ్చు అట్టితరి కర్ణుని నిగ్రహించు ఉపాయమడుగుతాడు. చివరకు కర్ణుణ్ణి మానసికంగా నిరుత్సాహ పరచడానికి ఒప్పుకొంటాడు శల్యుడు. 

శల్యుడు మదిరా వ్యసనపరుడు. ఆ మాటకొస్తే ఆ కాలములో మధువు ఎవరికినీ నిషేధము కాదు. ఈ కాలములో మాదిరే కొందరు అతి కొందరు మితము. యుద్ధ సమయములో శల్యుడు కర్ణున్ని దేప్పిపొడుస్తూవుంటే కర్ణుడు అతన్ని అతని వంశాన్ని అతని దేశాన్నే, మీరు కల్లు  తాగిన తరువాత అమ్మ పాలు తాగేవారంటాడు. అట్లని శల్యుడు మానధనుడు కాదు అని చెప్ప
వీలులేదు. అసలు మొదట దుర్యోధనుడు కర్ణునితో కూడా శల్యునివద్దకు పోయినపుడు కర్ణుని రథ సారథి కమ్మంటే సూతపుత్రునికి రాజులు రథసారధులు కావాలని అడుగుటయే తప్పంటాడు. దుర్యోధనుడప్పుడు ఆశ్వ శాస్త్రములో ఆయనను కృష్ణుని మించినవానిగా కీర్తిస్తాడు.అందుకు సాక్ష్యం ఆయన మేనల్లుడైన నకులుడు తంత్రీపాలునిగా అశ్వరక్షకుడై విరాటుని కొల్వులో వుంటాడు. అదియునుగాక దేవ వైద్యులైన అశ్వనీ దేవతల వరప్రసాదుడు కూడా కదా. కర్ణుడే స్వయంగా దుర్యోధనుని అశ్వహృదయము తెలిసిన శల్యుడు తన సారధి అయితే తాను సులభంగా అర్జనుని గెలువగలనంటాడు. శల్యుడు దుర్యోధనుని మాటకు మెచ్చి సరే యని అంటూ నేను  నా మనసుకు తోచిన మాటలు మాట్లాతాను, కర్ణునికి సమ్మతమైతే నాకూ సమ్మతమే అంటాడు. అతను ధర్మజునికిచ్చిన మాట ఆ విధంగా నిలుపుకొన్నాడు. మత్తులో వున్నా మాట తూల లేదు. 

17 వ రోజున కర్ణుని మరణానంతరము సైన్యాధ్యక్షుణ్ణి ఎవరిని చేయాలని ప్రశ్నించినపుడు అశ్వథ్థామ, కృతవర్మ కృపాచార్యుల ముందే వీర ధీర శూరుడైన శల్యుడే తగినవాడని చెబుతాడు. అది శల్యుని మాన్యత. కర్ణుని చావుకు అతను కూడా ఒక కారణమని వారెవరూ నిందించలేదు. కృష్ణుడు అర్జనుని ప్రక్కన వుంటే కర్ణుడు గెలువలేడని వారికి తెలుసు. పైపెచ్చు కర్ణుడు నాగాస్త్రము సంధించునపుడు శల్యుడు గుండెకు గురి పెట్టమన్నా కర్ణుడు తనపైన తనకున్న ధీమాతో కంఠానికే  గురి పెడతాడు. కృష్ణుడు రథాన్ని భూమిలోనికి తన కాలితో అదమగా ఆ అస్త్రము అర్జనుని కిరీటమును తొలగించి వెళ్ళిపోతుంది, అది ఒకసారే వాడవలెను కాబట్టి . 18 వ రోజున ధర్మజునితో పోరు సల్పునపుడు  ధర్మరాజ,సాత్యకి, భీమ ,నకుల సహదేవులందరూ ఒకాసారిగా శల్యుని పై విజృంభించగా అందరినీ మూర్ఛాగ్రస్థులను చేస్తాడు. దుర్యోధనుడది చూసి శల్యుడు వారిని చంపినాడనుకొంటాడు.    

ధర్మరాజు మనస్సులో " శ్రీకృష్ణుడు నన్ను శల్యుని చంపమని నియోగించినాడు. "ఆమహానుభావుని మాట వమ్ము అయ్యేలా ఉంది. ఇక నాకు ఆ పరమేశ్వరుడే దిక్కు " అనుకుని రధము మీద నిలబడి " ఓ పరమేశ్వరా ! నీవు త్రిశూలధారివి, నిర్గుణుడివి, నిరాకారుడివి, త్రినేత్రుడివి. సృష్టి, స్థితి, లయ కారకుడివి. త్రిభువనములకు పూజనీయుడివైన నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను నన్ను ఈ గండం నుండి కాపాడు " అని మనస్పూర్తిగా ప్రార్ధించి మెల్లగా లేచి శల్యుడి మీద శరప్రయోగం చేస్తాడు. ధర్మరాజు శక్తి హీనుడయ్యాడని తెలుసుకుని శల్యుడు రెట్టించిన ఉత్సాహంతో ధర్మరాజు మీద బాణములు వేస్తాడు. భీమసేనుడు మధ్యలో వచ్చి శల్యుని విల్లు విరిచి హయములను చంపుతాడు. శల్యుడు కూడా విరధుడౌతాడు. కత్తి డాలు తీసుకుని తన వైపు వస్తున్న శల్యుడి మీద తన శక్తిని అంతా ప్రయోగించి ధృడసంకల్పంతో   తన వద్ద పూజలందుకుంటున్న పరమేశ్వర ప్రసాదితమైన శక్తి ఆయుధమును బయటకు తీసి భక్తితో నమస్కరించి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ క్రోధంగా ప్రళయకాల రుద్రునిలా శక్తి కొద్దీ విజృంభించి తన వైపు వస్తున్న శల్యుని మీద గురి చూసి బలంగా విసిరాడు. ఆ శక్తి ఆయుధం నిప్పులు కురుస్తూ శల్యుని వైపు దూసుకు పోయి అతడి కవచమును చీల్చుకొని గుండెలను దూసుకుంటూ భూమిలోకి పోయింది. శల్యుడి శరీరం నుండి రక్తం ధారాపాతంగా కారింది. మొదలు నరికిన చెట్టులా శల్యుడు నేల మీద బోర్లా పడ్డాడు. శల్యుడి ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోయినాయి. ఇంత యుద్ధము చేసి ఒక మహా వీరునిగా మరణించుతాడు  శల్యుడు . 
తనను నమ్ముకొన్న దుర్యోధనుడు దుష్టుడని తెలిసియు, ధర్మరాజాదులకు మేనమామ అయివుండియు, కృష్ణుడున్నవైపే 
జయము నిశ్చయమని తెలిసియు కేవలము తాగిన మైకములో ఇచ్చిన మాట నిలుపుకొనుటకు తన ప్రాణాలనే వదలిన మాన ధనుడు . 

చెప్పిన మాటకు కట్టుబడి కర్ణుని నిరుత్సాహపరచుట వల్ల శల్య సారధ్యమన్నమాట లోకోక్తిగా మారింది కానీ శల్యుడు మాట నిలుపుకొన్న మహారాజు . 

తత్సత్ 

Tuesday, 3 December 2013

దేశం-సందేశం

ఘన కీర్తి కల్గినది నాదేశం గమనించుమా నాదు సందేశం

అంబులెన్సులు లేటు ఆటోలు బహు రేటు ఆర్డరిస్తే పిజ్జ వచ్చి తట్టును గేటు
కారు లోనుకు వడ్డి ఏడు పర్సెంటు కాలేజి చదువులకు పది రెండు పర్సెంటు
కొనగ బియ్యము కిలో అరనూరు అకట కన సిమ్ము ఫ్రీ మనదు సెల్ ఫోను కిచట
భారత రత్నాలు బహు చౌక యంట పరికింపగా ఉల్లి కనిపించు మింట
క్రికెటులో దేవుళ్ళు కనిపించు చోటు క్రీడలన్నింటిలో కనిపించు లోటు
ధరలతో చదువేమొ ధర దాటునంట దారి గానక పేద తడిబెట్టు కంట

దొరకదు గుండెలో పేదలకు చోటు దొరల జేబులు నిండు నోటుపైనోటు
ఐదేళ్ళ కొకసారి అడిగేను ఓటు ఆపైన మన బాధ చూడడా కేటు
కొట్టుకొనిచచ్చినా తనకేమి లోటు కేబినెట్లో వున్న చాలునొక సీటు
దొరలు దొంగలు ఇచట కలిసి రొక జట్టు దొడ్డి దారుల నెక్క మెట్టు పై మెట్టు
ఆత్మతో చూడగా ఆకురాలిన చెట్టు మా నాయకులకొచ్చు చేయ కనికట్టు
చెప్పితిని మీకిపుడు మా భూమి గుట్టు చెవియొగ్గి విని మీరు చేయకండిది రట్టు

ఘన కీర్తి కల్గినది నాదేశం గమనించుమా నాదు సందేశం
బైబిల్ 

కృష్ణ మోహన్ గారి ప్రశ్నకు శర్మగారి ద్వారా జవాబు దొరికిందని తలుస్తూ పాశ్చాత్యులలో పేరెన్నిక గన్న వాళ్ళు బైబిలును గూర్చి ఏమన్నారో వారి మాటల్లోనే మీ ముందుంచుతున్నాను 

Thomas Jefferson, the third President of America, admits candidly :
It is between fifty and sixty years since I read the Apocalypse (Revelation), and I then considered it merely the ravings of a manac.--76
- Thomas Jefferson

Joseph Lewis, President of Free Thinkers of America and editor of The Age of Reason, states :
The Bible is not a divine revelation from God. It is not inspired; on the contrary, it is a wicked book .... It has been responsible for more suffering and torture than any other volume ever printed--77
- Joseph Lewis

Ms Matilda Joslyn Gage, an American writer, states
Boiling heretics and malefactors alive, commonly in oil but occasionally in water, was practised throughout Europe until a comparatively late period.--78
                                                                                                                                                                          - Matilda Joslyn Gage
 అసలు 'బైబిలు ' అంటేనే పుస్తకముల దొంతర అని అర్థము. గ్రీకు భాష లో 5680 కి పై చిలుకు బైబిళ్ళు ఉన్నాయని అంచనా .సిరియచ్ లాటిన్ కోప్టిక్ ఆర్మనిక్ భాషలలో 19,000 వునాయని అంచనా. ఇవి కాక ఆంగ్లములో 24,000 ప్రతులున్నాయని అంచనా . ముఖ్యమైన విషయమేమిటంటే  ఇవియేవీ  ఒకే పుస్తకము యొక్క ప్రతులు కావు. వేరు వేరు పుస్తకములు. జార్జ్ బెర్నార్డ్ షా , పైని  మొదలగు పాశ్చాత్య విజ్ఞులు ఈ గ్రంధమును ఎంతో  విమర్శించినారు. వీటన్నిటిలో కూడా ఎన్నోప్రక్షిప్తాలు ,అనుకరణలు, అనుసరణలు వున్నాయి. 4-24(deuteronomy)God himself proclaims like this ' For the lord your God is consuming fire, a jelous God'
ప్రపంచములో, According to the World Christian Encyclopedia (year 2000 version), global Christianity had 33,820 denominations with 3,445,000 congregations/churches composed of 1,888 million affiliated Christians, వున్నాయి . వీరు ఒకరి చర్చి కి ఒకరు పోరు . హిందుత్వములో  కులాల విషయం వస్తే మాత్రం అంటా ఒకటైతారు. దాని వెనుక వుండే సదుద్దేశ్యమును గమనించరు. 
వారి విషయాలలోనికి పోవుట కంటే మన సనాతన ధర్మమూ పైన మహనీయులు (వారిలో పాశ్చాత్యులు కూడా వున్నారు ) వ్రాసిన పుస్తకాలు యువత చదువనారంభించితే ఈ ధర్మమూ విశ్వ మానవ శ్రేయస్సుకు ఎంతో  ఉపయోగ పడుతుంది. 
”अयं बन्धुरयं नेति गणना लघुचेतसाम् | उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् || ”
ayaṁ bandhurayaṁ nēti gaṇanā laghucētasām | udāracaritānām tu vasudhaiva kuṭumbakam ||
Discrimination saying "this one is a relative; this other one is a stranger" is for the mean-minded. For those who're known as magnanimous, the entire world constitutes but a family.