The "clash of civilizations"
A clash of civilizations is occurring throughout in the world today, a war of cultures at various
levels in both our personal and public lives. This clash is partly because of rising historical and
cultural awareness on the part of newly-independent countries, beginning with India . The
Western-European/North American culture is currently predominant and is strongly, if not
rudely, trying to eliminate or subordinate the rest. Yet Western civilization is spreading itself
not so much by force, as in the colonial era, but by subtle new forms of social manipulation.
These include control of the media and news information networks, control of the
entertainment industry, domination of commercial markets, continued missionary
aggressiveness by Western religions, and – as important but sometimes overlooked – control of
educational institutions and curricula worldwide.
This control of education has resulted in a Western-European/North-American view of history
and culture in textbooks and information sources in most countries, including India . Naturally,
people educated according to Western values will function as part of Western culture, whatever
may be the actual country of their birth. They will experience an alienation from their native
culture in which they have not really been raised. They easily become a fifth column for the
Westernisation of their culture, which also means its denigration or, at best, its
commercialisation. An authentic Indian or Indic perspective, a worldview coming out of the
culture of India and its particular values and perceptions, is hardly to be found, even in India .
The Western school of thought is taught in India , not any Indic or Indian school of thought.
రాజును చూసిన కంట ..........
రాజును చూసిన కంట మొగుణ్ణి మొట్టబుద్ధయినదన్నది, బహుశ రాజులకాలము నాటి సామెత కావచ్చు. ఇప్పుడో
'ఒబామా, ఓ భామా అంటే వస్తున్నా మామా' అనే కాలం. అంటే తన ప్రభావాన్ని
మన అంతరంగాలలో అంతగా అమెరికా అమరిక చేసింది. మనసు దోమ వంటిది. అది ఎప్పుడూ పెంట కుప్పలనే
వేదుకుతుంది. మనసును కవ్వించే మామిడిపండును చూసినా మచ్చ వున్న చోటనే అది వాలుతుంది. ఆచెడ్డను
పీల్చి మంచి చెడ్డ తేడా లేకుండా 'సమాజము' అనే మనిషి పై వాలి వ్యాధిగ్రస్తుణ్ణి చేస్తుంది. వ్యాధి వచ్చిన

పిదప దానిని వదిలించుకొనుటకే సమయము సరిపోతుంది పుణ్యకాలము ముగిసి పోతుంది. అందుకే
పెద్దలు బాగుపరచుకోనుట కంటే భద్రంగా వుండటం మంచిది అంటారు.
పెద్దలు బాగుపరచుకోనుట కంటే భద్రంగా వుండటం మంచిది అంటారు.
ఇక అసలు విషయానికి వస్తాము.ఒకానొక కాలములో ప్రపంచమంతటా ఈ వైదిక నాగరికత విలసిల్లేది. కాలము
మారిపొయినది. ఓడలు బండ్ల పాలు బండ్లు ఓడల పాలు అయినాయి. దేశ విదేశ నాగరికతలు ప్రచండ మార్తాండ
కీలలు ప్రసరింపజేస్తూ వుంటే ఆ తాకిడికి అందరూ లోను కావలసినదే. కానీ ఆ వేదినికూడా తమకనుకూలముగా
మలచుకొనే బుద్ధిమంతులు వుంటారు. మనమూ వారిలో ఒకరైతే సమస్యే లేదు. కాకుంటేనే కష్టకాలము
కొనితేచ్చుకోవలసి వస్తుంది.ఇప్పుడు ప్రపంచములో నాగరికత అన్నపేరుతో దేశ విదేశాల నడుమ సంకుల
సమరములు, కత్తి కటారు ఈతే బాకు తుపాకులు లేకుండానే జరుగుతూ వున్నాయి. వెలసిన ఎన్నో కొత్త దేశాలతో
ఈ సంపన్న దేశాల నాగరికతలను ముఖ్యముగా వేషము, భాష ,ఘోష (Accent ) మనము నకలు చేస్తున్నాము.
మరి ఒకటి పొంధవలెనంటే ఒకటి పోగొట్టుకోనవలసినదే కదా ! అంటే కోట్ల సంవత్సరాల నాగరికతలోని మంచిని
మంచినీళ్ళ ప్రాయంగా వాడి ఈ రోజు మంచినీళ్ళు కూడా 'మనీ' తో కొనవలసి వస్తూవుంది.నేడు పాశ్చాత్య, ఉత్తర
అమెరికాల నాగరికత అతిశయముగా అనుకరించుతున్నారు. మంచి నిజానికి ఎక్కడునా తీసుకోన వలసినదే.

ప్యాంట్లు వాడుతున్నాము మంచిదే కానీ జీన్స్ వాడుటవల్ల శరీర అవయవములకు తగిన గాలిని
సమకూర్చగాలుగుచున్నామా ? మాసిన మసక బారిన చినిగిన జీన్సు ఫాషన్ పేరుతో వేసుకొంటున్నాము. కొందరు
అస్తర్లు ( అంటే చినిగిన చోట వేరే బట్ట చింపిని అంటించి కుట్టుట ) వేసిన జీన్స్ ప్యాంట్లు తొడుగుతారు. ఆ
దేశాలలో చలి ఎక్కువ, పైగా ఏదయినా దేహ కష్టము చేయునపుడు వేసుకొని కార్యాలయాదులకు పోవునపుడు
చక్కని ఉడుపులను వేసుకుపోతారని విన్నాను. మరి వారి శీతోష్ణ స్థితులు మనకు లేవుకదా ! ఈ విధమైన
తాకిడులతో మనకున్న మంచిని వదలివేస్తున్నాము. నేత పంచ ఇంటనున్నప్పుడు కట్టుట చాలా ఆరోగ్య

దాయకము రాను రానూ పెద్దపంచాలు పోయి అడ్డ పంచలు, అవిబోయి లుంగీలు , ఇప్పుడవి కూడా పోయి
తోదలవరకో మోకాళ్ళ వరకో పిక్కల వరకో గొట్టాలు వేసుకొంటున్నాము. ఇవన్నీ మగవారిని గూర్చి మాత్రమె
తెలిపినవి. నేటి మహిళా యువతను గూర్చి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ముందు కాలములో బ్రిటీషు
వారు తమ ఆచారవ్యవహారాలను మనపై బలవంతంగా రుద్దేవాళ్ళు. ఇప్పుడు వారి గమ్యమదే అయినా

దారి మార్చినారు. దూరదర్శని,గణిని (computer),వార్తా పత్రికా సముదాయము,వినోద ప్రదాన పరిశ్రమ, వస్తు
సముదాయ విపణి, మత కూటముల విశృంఖల మతాంతరీకరణ ,విద్యా విధానము పై ప్రభుత్వ ఉదాసీనత,
అతుకులబొంతయగు పాశ్చాత్యులేర్పరచిన చరిత్ర పాఠాలు, ఐరోపా దేశాలసంస్కృతులకు సంబంధించిన
పాఠాలు, మాతృభాష పై ఉదాసీనత మరియు ఇంగ్లీషు పై ఎనలేని వ్యామోహమును కలిగించు వ్యూహములు పన్ని,
బాలుర, యువకుల మేధను అతలాకుతలము జేసి ఆడుకోనుచున్నారు. చదువును ధాత్రీకరణ (Globalisation =
ప్రపంచీకరణ)మొనర్చి తాము విలువలనుకొనే తమ దేశ సంస్కారములను మన విద్యార్థులపై రుద్ది తప్పుదారి
పట్టించి దేశమునే ప్రచ్చన్నముగా ఏలే ప్రయత్నములో సఫలీకృతులగుచున్నారు. ప్రీ.కేజీ, యల్.కేజీ,

యు.కేజీ అని అతి చిన్నవయసులో బడికి పసి పిల్లలను లాగి వారి లేత బుర్రలో తమ భాష ప్రతిష్ఠించుచున్నారు.
తల్లిదండ్రులుకూడా దానికి తందాన తాన పాడుచున్నారు. తల్లిదండ్రులు మనసు పెట్టి ఆలోచించితే జ్ఞానము
భాషవల్ల కాదు మనము వారికి నేరిపించే విషయములపై ఆధారపడి యుంటుంది. ఈ జగత్తుకే తల్లి భాషయైన సంస్కృతమునకు ముద్దు బిడ్డయైన తెలుగును నేర్పించితే ఇటు సంస్కృతము అటు ఆంగ్లము అవలీలగా నేర్చుకొనవచ్చు. ' అమరకోశము' ప్రతి రోజూ తల్లిదండ్రులైన మీ బాధ్యతగా పిల్లలకు చెప్పించండి. 'మమ్మీ డాడీ లు ఆంటీ అంకుళ్ళు' అనే కుళ్ళు మాటల కన్నా ' అమ్మ, నాన్న, బాబాయి, పిన్ని, మామయ్యా అత్తయ్య,పెద్దప్ప, పెద్దమ్మ , వదినె, అక్క, చెల్లి, మొదలైన అనుబంధాలతో పిలుచుకొంటే ఎంత కమ్మగా వుంటుంది. మన సంస్కారము మన దేశము,మన ప్రాంతము మన భాష మన అనుబంధము మన అంతఃకరణలలో వుంటాయి. విజాతి భాషలలో ఎక్కడనుడి మనదైన సంస్కారము రాగలుగుతుంది. విదేశీ సంస్కారము వారి మహిళల ఉడుపులవలెనే ఉంటుంది. మేల్కొనండి. కళ్ళు పులుముకొని వాస్తవాలను గమనించండి. ఇప్పటికే ఎంత పోగొట్టుకోన్నామో గుర్తించండి. ఈ జాతి పురావైభావమునకు నడుము కట్టండి. ఈ దేశపు ఉనికిని కాపాడండి.
ధర్మ ఎవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః
తస్మాద్ధర్మో నహన్తవ్యో మానోధర్మో హతోవధీత్
మన ధర్మాన్ని మనము రక్షించితే అది మనలను రక్షిస్తుంది. శిక్షిస్తే శిక్షిస్తుంది. వధించితే వధిస్తుంది. అంటే
ధర్మమూ అద్దము లాంటిది మనమేమి చూపిస్తే అదే కనబరచుతుంది.
No comments:
Post a Comment