Saturday, 15 February 2014

తెలుగు గంగ - జరిగిన విషయము నిజంగ ( తెలుగుగంగ -- సమయస్ఫూర్తి)


తెలుగు గంగ - జరిగిన విషయము నిజంగ (తెలుగు గంగ సమయస్ఫూర్తి)

ఈ ఉదంతము కూడా 'నాకేమి బెనిఫిట్' రోజులలో జరిగినదే. మా DGM గారు ఒక శనివారం నన్ను తమ CABIN కు పిలిపించినారు. శనివారం అన్న విషయం ఎందుకు తెలుపుచున్నానంటే అది అర్థ పనిదినమనాలో లేక వ్యర్థ పనిదినమనాలో తెలియదు. అందరూ holiday mood లోనే వుంటారు. నేను వారివద్దకు వెళుతూనే వారు "రామ మోహన్ గారు నేను ఇంతకు మునుపే తెలుగు గంగ ప్రాజెక్ట్ డైరెక్టర్ కనుమలూరి వెంకట శివయ్య గారితో వారి ప్రాజెక్ట్ ఫండ్స్ గురించి మాట్లాడినాను. వారికి తెలుగంటే మక్కువ ఎక్కువ పైగా ఆయన తెలుగులో మంచి పాండిత్యమున్నవాడు . అందువల్ల ఆయన శ్రీనాథుని గురించి మాట్లాడుతానన్నారు. 2 గంటలకు వస్తానన్నారు కాబట్టి మనము పని ముగించుకొని సమావేశమును ఏర్పాటు చేస్తాము" అన్నారు. నేను "అలాగే సార్ కానీ ఈ దినము శనివారమైనందువల్ల ఎక్కువ మంది మధాహ్నం 2 గంటలవుతూనే వెళ్ళిపోతారు" అన్నాను .

వారు వెంటనే "సభ్యుల బాధ్యత నాది సభ బాధ్యత మీది" అన్నారు. నేను "సరే" అనక ఏమనగలను. "వారు సభకు శ్రీనాథుని పరిచయం చేస్తారు, మీరు వారిని పరిచయం చేయండి, వారిచ్చే డెపాజిట్టు బ్యాంకు ప్రగతికి ఫిట్టు " అన్నారు. నేను మనసులో "మన ప్రమోషనులకు తొలిమెట్టు, నాకు తెలుసు ఈ గుట్టు" అనుకొని వారి మాటకు సరే అన్నాను.

నేను బయటికి వచ్చి నా తోడూ నీడయైన మిత్రులు కలిసి కుర్చీలు, మేజాలు, మేజాలపై పరిచే బట్ట, పూలకుండి , మంచినీరు, మైకుసెట్టు అన్నీ ఏర్పాటు చేసి టైము చూస్తే 2-15. వారు వచ్చే సమయమైనది అని అనుకొనెటంతలోనే వారు మా DGM గారూ వేదిక వద్దకు వస్తూ కనిపించినారు. వారు, తమకు అమర్చిన ఆసనములలో కూర్చోవటము ప్రార్థనా గీతమాలపించడము జరిగి పోయినాయి. ఇంతా ఎందుకు చెప్పుకు వచ్చినానంటే నేను ఆయనను గూర్చి మా DGM గారిని అడిగే అవకాశమే లేకుండాపోయింది. ఇక నేను వారిని సభకు పరిచయము చేయుటయే తరువాయి.

వెంకటశిఉవయ్యగారి తండ్రిగారు ఆంధ్ర పండితులన్న విషయం ఒకటి, శివయ్యగారు I.A.S. అన్నదొకటి నేను తెలుసుకోన్నవిషయాలు. పరమేశ్వరుని కృపవలన ప్రార్థన ముగిసి అధ్యక్షుని తోలిపలుకుగా మా DGM గారు మాట్లాడేలోపు ఒక పద్యం తయారుచేసుకొన్నాను శివయ్య గారిని గురించి. రామమోహన్ గారు వక్తను సభకు పరిచయం చేస్తారు అనగానే నేను గొంతు సవరించుకొని, జలుబు చేసిన వాని చేతిలో ఐస్ క్రీము కప్పున్నట్లు మొగము పెట్టి, మైకు వద్దకు నడిచి నాకు నేను ధైర్యము చెప్పుకొని నా ఉపన్యాసము ఈ విధముగా ప్రారంభించినాను :

"సభకు నమస్కారము . మాన్యులు వెంకట శివయ్య గారు పండిత పుత్రులు. చాలా మంది, పండిత పుత్రులు పరమ శుంఠలనుకొంటారు. మల్లె చెట్టుకు కాకడాలు పూయవు. (కాకడాలను తురక మల్లెపూలని కూడా కడప ప్రాంతములో అంటారు. అవి తెల్లగానైతేే వుంటాయి గానీ వాసన ఇసుమంతకూడా వుండవు.) తెలుగులో దిట్టయేగాక వీరు I.A.S. కూడా. సభికులు అర్థము చేసుకోగలరు వీరి ప్రతిభా ప్రాభవము. వారిని గూర్చిన ఈ పద్యము చిత్తగించండి " అంటూ ఈ క్రింది పద్యము, నే వ్రాసుకొన్న కాగితము చూసి చదువ ప్రారంభించినాను :

అయ్యేయస్సనియన్నచో జగతిననన్ ఆంగ్లమ్మనే యూహలన్
పొయ్యేరీతిన శ్రేష్ఠ మౌ తనదియౌ ప్రౌఢాంధ్ర నావన్ మమున్
అయ్యారే యననోప్ప త్రిప్ప ఘనమౌ యంబోనిధీసీమలోన్
అయ్యా వచ్చితిరిట్లు మీరు, మనసా అభ్యర్చించమే మిమ్ములన్

చదివిన వెంటనే నేను మాట్లాడిన మాటలు ఇవి :

"తెలుగుగంగ ప్రాజెక్ట్ డైరెక్టరు గా, ఏ తెలుగు రాని I.A.S. నో కూడా వేయవచ్చు కదా, వీరినే ఎందుకు వేసినారు అన్న ఆలోచన నా మదిలో మెదిలింది. ఆలోచించగా అందుకు జవాబు దొరికింది. అదేమిటంటే 'అది' తెలుగు గంగ కాబట్టి, పైగా ఆయన తెలుగులో పండితుడు మరియు పేరుగన్న తెలుగు పండితుదాగు శ్రీయుతులు కనుమలూరు శివరామయ్య గారి  కుమారుడు. సరే! మరి వేరే తెలుగు I.A.S. ను వేయవచ్చు కదా అన్న అనుమానం మీలో రావచ్చు. ఆ ఊహకు వీలు లేదు ఎందుకంటే అది గంగ ఆయన శివుడు. అంటే తెలుగు గంగను తెలుగు శివుడే భరించ గలడు. మరి వారు కేవలము శివయ్య కాదుగదా వెంకట శివయ్య కదా అంటారేమో. నిజమే ఇంత పెద్ద ప్రాజెక్టు ఎంతో డబ్బుతో కూడినపని. మరి అంతంత డబ్బు విషయాలను వేంకటేశ్వరుడు కాక వేరెవరు చూసుకోగలరు. కాబట్టి వెంకటశివయ్య గారికి ఈ బాధ్యతా నిచ్చినారు. ఒకవేళ వేరొక తెలుగు వెంకటశివయ్య I.A.S. వుంటే ఆయనకు ఇచ్చియుండవచ్చు కదా అన్న అనుమానము మీకు రావచ్చు. కానీ వీరికున్న ఇంటిపేరు కలిగిన I.A.S. వేరెవ్వరూ లేరు. మరి వీరి 'ఇంటిపేరుకు' ఏమి ప్రాముఖ్యత ఏమి అన్నది మీ ఉత్సాహభరితమైన ప్రశ్న. దానికీ జవాబుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల ఇది వచ్చే దారిలోని కోనలలోని ఊళ్ళు ఎన్నో ముంపునకు గురియౌతాయి. వీరి ఇంటిపేరు 'కనుమలూరే' కదా!" అన్నాను . అందువల్ల గంగను కనుమలు దాటించి ఊళ్ళకు పునరావాసము కల్పించి ప్రజలకు, గ్రామాలకు రాష్ట్రానికి ఎంతో సేవ చేయగలరని, ఆయన ఘనతనెరిగిన ప్రభుత్వము ఆయనకు ఆ పదవినిచ్చి పదవికి ఔన్నత్యమును ఆపాదించినది.

ఈ స్వల్ప భాషణమునకు మిక్కిలి సంతసించిన వెంకటశివయ్యగారు తెలుగు గంగకు నాపేరుకు ఇంత అవినాభావ సంబంధమున్నదని నా ఊహకు ఎప్పుడూ అందలేదన్నారు. వారి ప్రసంగముతో కార్యక్రమము ముగిసిన తరువాత మా D.G.M. గారు " మీ సమయస్ఫూర్తి సంస్తుతి పాత్ర"మన్నారు.

నాకంటి చూపు ఆకాశాన్నంటింది. అహంకారముతో కాదు సుమా అత్యంత కృతజ్ఞతాపూర్వకమైన అంజలినాపరమాత్మకు అర్పించుటకు.

స్వస్తి
Like
Comment
Share

23శారదా ప్రసాద్, Vedapanditaha Sannidhanam Dixitulu and 21 others

Comments

Subbarao Yadavalli: Inthaki entha deposit sekarincharo cheppaledu kadaa Ramamohanrao garu.
Manage 4y ·  Like
Cheruku Ramamohanrao ఇటువంటి ఉదంతాలెపుడూ సుఖాంతాలే కదా సుబ్బారావు గారు.
1 Manage 4y ·  Like
Sambhara Venkata Rama Jogarao ఆర్యా, సమావేశ సందర్భములో తమకు గల ఆంధ్ర భాషాభినివేశము, చమత్కృతి, సంస్తుతి వారిని ఆకొట్టుకుని, తమ ప్రఙా పాటవములకు శ్రీవారు పరవశించి, అనుగ్రహించితిరని తెలుసుసుకుని సంతోషించితిని.
అభివాదములతో,
భవదీయుడు Sambhara Venkata Rama Jogarao
1 Manage 4y ·  Like  · See Translation
Srinivasa Chakravarthy Jonnalagadda APPUDU CHESINA DEPOSIT NUNCHI IPPUDU VADDI RUPAM LO(MEE POST )MAMMU PARAVASIMPA CHESTUNNAI GURUVU GAARU. DHANYAVADAALU.

1 Manage 4y ·  Like
Cheruku Ramamohanrao: మీ అందరి అభిమానానికి నా కృతజ్ఞతలు

Manage 4y · Like
Mukkavilli Dharma Prakasa Rao I am astonished - how u could able to spare your time for Telugu literature despite your busy schedules in the office.
1 Manage 4y · Like
Temburu Kishore: Hats off guruvu garu
1 Manage 4y · Like

Kavitha Prasad Rallabandi Kavitha Prasad Rallabandi: Sir! You are highly resourceful and creative! Padya dhaara chakka ga undi!

1 Manage 4y ·  Like
Lakshminarayana Murthy Ganti తెలుగు గంగలా ధరకు జారిన శివగంగ నిధులవరదతో మీ బ్యాంకు మునుగంగ సత్యబాషణతో సాగిన మీ అంతరంగ పదగంగ యుప్పొంగ యా ఆనందలహరిలోమేమందరమూ తడవంగ అందుకొనుడు మా అబినందనలు ఘనంగా-గంటి
3 Manage 4y · Like
Krishna Mohan Mocherla Cheruku Ramamohanrao garu ... Thanks for sharing your personal experience and your language skills are wonderful. __/\__

1 Manage 4y · Like
Cheruku Ramamohanrao: it was the same doubt my superiors used to express. As you know M.D. gaaru 'where there is a will there is a way'
Manage 4y · Like
Cheruku Ramamohanrao thank you Kishore
Manage 4y · Like
Cheruku Ramamohanrao: Kavita Prasad Garu, I feel it privileged to have your comment. Anything appreciable, if at all i have, it is gods' grace and good wishes of people like you. Thank you very much.

Manage 4y · Like
Cheruku Ramamohanrao thank you for the comment\complement. What else I can say for the affection you have for me.

Manage 4y · Like
Cheruku Ramamohanrao Lakshminarayana Murthy Ganti గారూ మీ ప్రతిభకు నేను అప్రతిభుడనైనాను. అనన్యమైన మీ అభిమానానికి నేను ఆసాంతము కృతజ్ఞుణ్ణి .

Manage 4y · Like
Pavankumar Prakhya Telugu Ganga tumpralu ma meeda kuda paddayi ee post chadivinandulaku :-)
2Manage 4y · Like
Cheruku Ramamohanrao 'పెద్దలు గంగా స్నానం తుంగా పానం'అన్నారు. ధన్యవాదాలు పవన్

No comments:

Post a Comment